Good Luck Sakhi Telugu Teaser : కీర్తి సురేష్ 'గుడ్ ల‌ఖ్ సఖి' టీజర్ వచ్చేసింది!

Good Luck Sakhi Telugu Teaser : కీర్తి సురేష్ గుడ్ ల‌ఖ్ సఖి టీజర్ వచ్చేసింది!
x
Good Luck Sakhi Telugu Teaser
Highlights

Good Luck Sakhi Telugu Teaser : మ‌హాన‌టి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది హీరోయిన్ కీర్తి సురేష్ .. ఈ సినిమా తర్వాత

Good Luck Sakhi Telugu Teaser : మ‌హాన‌టి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది హీరోయిన్ కీర్తి సురేష్ .. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ చేయబోయే సినిమాల పైన చాలా అంచనాలు నెలకొంటున్నాయి.. ఆమె ప్రధాన పాత్రలో లేడి ఓరియెంటెడ్ మూవీగా గుడ్ ల‌ఖ్ స‌ఖి అనే చిత్రం తెరకెక్కుతుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.. ఈ మూవీ టీజర్‌ని ప్రభాస్ చేతుల మీదుగా విడుద‌ల చేయించారు.

నిమిషం రెండు సెకండ్స్ ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో కీర్తి సురేష్ నటనతో మరోసారి ఫిదా చేసేలాగా ఉంది.. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా నటించింది. కీర్తి సురేష్ తో పాటుగా ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దిల్‌ రాజు పమర్పణలో సుధీర్‌ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందించారు. మొత్తం మూడు భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదల కానుంది.. ఇక ఈ టీజర్ కి మంచి రెస్పాన్ వస్తుంది..

ఇక తాజాగా పెంగ్విన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కీర్తి సురేష్.. ఈ సినిమా థియేటర్‌లో కాకుండా..డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక గుడ్ ల‌ఖ్ స‌ఖితో పాటుగా నితిన్‌కు జోడిగా 'రంగ్‌దే' చిత్రంలో, మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది కీర్తి సురేష్.



Show Full Article
Print Article
Next Story
More Stories