Sobhita Dhulipala: 'వాళ్ల గురించి నా పిల్లలకు చెబుతా'.. శోభితా ఇంట్రెస్టింగ్ పోస్ట్‌

Sobhita Dhulipala: మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'పొన్నియన్‌ సెల్వన్‌-1' ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 Oct 2024 10:57 AM IST
Gonna Tell my Kids These Were THE AVENGERS Actress Sobhita Interesting Post Goes Viral
X

Sobhita Dhulipala: 'వాళ్ల గురించి నా పిల్లలకు చెబుతా'.. శోభితా ఇంట్రెస్టింగ్ పోస్ట్‌

Sobhita Dhulipala: మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'పొన్నియన్‌ సెల్వన్‌-1' ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కల్కి కృష్ణమైర్తి రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు పార్టులుగా వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో మంచి వసూళ్లు రాబట్టింది. విక్రమ్‌, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌, శోభితా ధూళిపాళ్ల లాంటి భారీ స్టారింగ్ ఇందులో నటించి మెప్పించారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్ విడుదలై రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో నటి శోభితా ధూళిపాళ్ల ఆ సినిమా రోజులను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటోతో పాటు ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. ఫొటోలో ఉన్న అగ్ర తారలను ప్రస్తావిస్తూ.. 'వీళ్లందరూ ఎవెంజర్స్‌ అని నా పిల్లలకు చెబుతాను’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ పోస్టుపై నెటిజన్లు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్‌ చేస్తున్నారు.

నటి శోభిత ధూళిపాళ్ల, అక్కినేని హీరో నాగ చైతన్యతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే చైతో పెళ్లి పీటలెక్కనుంది. పెళ్లి ఎప్పుడన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు ఇరు కుటుంబాలు క్లారిటీ ఇవ్వలేదు. అయితే వీరి వివాహం విదేశాల్లో జరగనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట డెస్టినేషన్‌ వివాహం చేసుకోనుందని సమాచారం. ఇక ఇటీవల పిల్లలకు సంబంధించి శోభితా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనకు మాతృత్వం అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చిన శోభిత తాజాగా మళ్లీ పిల్లల గురించి వ్యాఖ్యానించడం విశేషం.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story