గోల్డ్ మైన్స్ వారికి షాక్ ఇచ్చిన అలవైకుంఠపురంలో రిజల్ట్

గోల్డ్ మైన్స్ వారికి షాక్ ఇచ్చిన అలవైకుంఠపురంలో రిజల్ట్

admin1
Updated on: 8 Feb 2022 10:00 PM IST
Gold Mines Shocked Them with the Result in Ala Vaikunthapuram Hindi Dubbed Version
X

గోల్డ్ మైన్స్ వారికి షాక్ ఇచ్చిన అలవైకుంఠపురంలో రిజల్ట్ 

Ala Vaikuntapuram Hindi Dubbed Version: అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప: ది రైజ్" సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక హిందీ లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లు నమోదు చేసుకోవడంతో నిర్మాతలు సైతం షాకయ్యారు. పుష్ప ఘనవిజయాన్ని చూసిన గోల్డ్ మెన్స్ సంస్థవారు అల్లు అర్జున్ నటించిన "అల వైకుంఠ పురం లో" సినిమాని కూడా థియేటర్లలో డబ్ చేసి విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాని అప్పటికే రీమేక్ చేస్తూ ఉండడంతో గోల్డ్ మైన్స్ వారు ఆ ఆలోచనను విరమించుకున్నారు.

ఈ నేపథ్యంలో "అల వైకుంఠపురం లో" హిందీ డబ్బింగ్ వర్షన్ కనీసం యూట్యూబ్ లో అయినా చూడొచ్చు అని అభిమానులు అనుకుంటూ ఉండగా, గోల్డ్ మైన్స్ వారు ఈ సినిమాని దించాక్ ఓటీటీ ప్లాట్ ఫామ్ కి ఇచ్చేశారు. యూట్యూబ్ లాగానే ఇది కూడా ఒక యాప్ కానీ యూట్యూబ్ ఉన్నంత యూజర్ ఫ్రెండ్లీ కాదు. దీంతో "అల వైకుంఠ పురం లో" సినిమా కి అంతంతమాత్రంగానే వ్యూస్ వస్తున్నాయి. అలా అని యూట్యూబ్ లో సినిమాని విడుదల చేయడానికి లేదు. దీంతో భారీ అంచనాలు ఉన్నప్పటికీ "అల వైకుంఠ పురం లో" సినిమా డబ్బింగ్ వర్షన్ అనుకున్నంత రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు కార్తిక్ ఆర్యన్ ఈ సినిమాని "షేహజాదా" అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.

admin1

admin1

Next Story