Godzilla vs Kong: మొదటి రోజే భారీ వసూళ్లు !

Godzilla vs Kong: ఇద్దరు యోధులు..ఒక్కరే విజేత అనేది ట్యాగ్‌లైన్‌.

Samba Siva Rao
Published on: 26 March 2021 2:37 PM IST
Box Office Collection Day 1
X

'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' ఫైల్ ఫోటో 

Godzilla vs. Kong: 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' ఇద్దరు యోధులు..ఒక్కరే విజేత అనేది ట్యాగ్‌లైన్‌. ఈ మూవీ ఎట్టకేలకు బుధవారం (మార్చి 24, 2021)థియేటర్లలో సందడి చేసింది. విడుదల అయిన తొలిరోజు దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం. తొలి రోజులు దాదాపు 6.4 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లు చేసింది. మాన్స్టర్ వార్స్, కాంగ్- స్కల్ ఐలాండ్, గాడ్జిల్లా- కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్' చిత్రాల తర్వాత ఈ సీరిస్ నుంచి వస్తున్న నాలుగో సినిమా ఇది. భారతదేశంలో ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతున్న 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' మూవీకి ఆడమ్ విన్ గార్డ్ దర్శకత్వం వహించారు.

'వార్నర్‌ బ్రదర్స్'‌, లెజండరీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన హాలీవుడ్ మూవీ విడుదలైన అన్ని చోట్లు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో అలెగ్జాండర్ స్కార్స్‌గార్డ్, మిల్లీ బాబీ బ్రౌన్, రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, షున్ ఒగురి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను వరల్డ్ వైడ్గా రిలీజ్ లెజెండరీ పిక్చర్స్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా వార్నర్ బ్రదర్స్ నిర్మాణ సంస్ధల్లో ఒకరైనా డెన్జిల్ మాట్లాడుతూ.. ఈ చిత్రం వసూళ్లపై సంతృప్తిగా ఉన్నామని తెలిపారు. " గాడ్జిల్లా Vs కాంగ్ "వంటి సినిమాలను ప్రేక్షకులు ఆహ్వానిస్తారని ఇది రుజువు చేస్తుంది" అని డెన్జిల్ వ్యాఖ్యానించారు. గాడ్జిల్లా Vs కాంగ్ మధ్య వచ్చే యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయని అన్నారు. కరోనా తర్వాత తొలి సారి ఓ హాలివుడ్ చిత్రం నేరుగా థియేటర్లలో విడుదల కావడం ఇదే ప్రధమం అని చెప్పారు. ఈ సినిమా విజువల్ వండర్ గా నిలుస్తోందని, విఎఫ్ఎక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ఆయన అన్నారు.

గత ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా మహమ్మరి కారణంతో వాయిదా పడింది. పరిస్థితులు కుదుట పడ్డతర్వాత ఈ ఏడాది ఈసినిమా విడుదల చేశారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారని బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కోసం చాలా కాలం పాటు ఎదురుచూశామని పివిఆర్ పిక్చర్స్ సిఈఓ కమల్ చెప్పారు. ఈ చిత్రం పైరసీ భూతం వెంటాడింది. రిలీజ్ అయిన తొలిరోజు పైరసీ సైట్లలో దర్శనమిచ్చింది. హిందీలో ఉన్న ఈ మూవీ తమిళ రాకర్స్, టెలిగ్రామ్, మోవియరుల్జ్ వంటి వాటిల్లో హెచ్డీ క్వాలిటీతో రిలీజ్ అయింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story