Prabhas: జపాన్‌ను షేక్ చేస్తున్న 'డార్లింగ్' క్రేజ్: ప్రతిష్ఠాత్మక 'అనన్' మ్యాగజైన్ కవర్‌పై ప్రభాస్!

Prabhas: జపాన్‌ను షేక్ చేస్తున్న డార్లింగ్ క్రేజ్: ప్రతిష్ఠాత్మక అనన్ మ్యాగజైన్ కవర్‌పై ప్రభాస్!
x
Highlights

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఖండాతరాలను దాటుతోంది. పాన్-ఇండియా స్థాయి నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతున్న ప్రభాస్, తాజాగా జపాన్‌లో ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఖండాతరాలను దాటుతోంది. పాన్-ఇండియా స్థాయి నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతున్న ప్రభాస్, తాజాగా జపాన్‌లో ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. జపాన్‌కు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన 'అనన్' (Anan) మ్యాగజైన్ లేటెస్ట్ ఎడిషన్ బ్యాక్ కవర్‌పై ప్రభాస్ సోలోగా మెరిశారు.

ఈ నెల 10న విడుదల కానున్న 2483వ సంచికలో ప్రభాస్‌కు సంబంధించిన ప్రత్యేక ఫొటోలను ప్రచురించారు. ఈ ఫీచర్‌ను సదరు మ్యాగజైన్ "రాయల్ ఆడియన్స్ గ్రావుర్" (Royal Audience Gravure) అంటూ అభివర్ణించింది. జపాన్ అభిమానులకు, ప్రభాస్‌కు మధ్య ఉన్న విడదీయరాని అనుబంధాన్ని ఈ కథనంలో ప్రత్యేకంగా హైలైట్ చేశారు.

గత ఏడాది డిసెంబర్‌లో ప్రభాస్ టోక్యోలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఈ మ్యాగజైన్ కోసం ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహించారు. సాధారణంగా జపాన్ మ్యాగజైన్స్‌పై భారతీయ నటులు సోలోగా కనిపించడం చాలా అరుదు. ఇప్పుడు ప్రభాస్ ఆ రికార్డును తిరగరాశారు.

'బాహుబలి' సినిమాతో జపాన్ ప్రేక్షకులకు చేరువైన ప్రభాస్, 'సలార్' చిత్రంతో అక్కడ తన మార్కెట్‌ను మరింత పెంచుకున్నారు. ఇక ఇటీవల విడుదలైన 'కల్కి 2898 ఏడీ' ప్రభాస్ పాప్యులారిటీని జపాన్‌లో శిఖర స్థాయికి చేర్చింది. ఈ నేపథ్యంలోనే జపాన్ మీడియా సంస్థలు ప్రభాస్‌కు పెద్దపీట వేస్తున్నాయి.

భారతీయ సినిమా సత్తాను, ప్రభాస్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఈ ఘనతపై 'డార్లింగ్' అభిమానులు సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ అంటే ప్రభాస్ మాత్రమే అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories