అజిత్ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న జిబ్రాన్

"వాలిమై" కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధం

admin1
Updated on: 11 Jan 2022 7:01 PM IST
Ghibran is the Music Director of Ajith Kumar Film Valimai | Telugu Movie News
X

"వాలిమై" కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధం

Ajith Kumar-Ghibran: తమిళంలో సంగీత దర్శకుడిగా మంచి పేరు ఉన్న జిబ్రాన్ "రన్ రాజా రన్" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత "బాబు బంగారం", "ఉంగరాల రాంబాబు", "హైపర్", వంటి సినిమాలకి సంగీతాన్ని అందించిన జిబ్రాన్ సాహో మరియు అశ్వత్థామ సినిమాలకీ నేపథ్య సంగీతాన్ని అందించారు. తాజాగా ఇప్పుడు జిబ్రాన్ అజిత్ సినిమాకి సంగీతాన్ని అందించడానికి సిద్ధమయ్యారు. కోలీవుడ్ లో స్టార్ హీరో అయిన అజిత్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా అజిత్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తమిళ సినిమా "వాలిమై".

ఇప్పుడు ఈ సినిమాని కూడా తెలుగులో "వలిమై" అనే టైటిల్ తో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాకి సంగీతం అందించడం కోసం జిబ్రాన్ ను రంగంలోకి దింపారు దర్శకనిర్మాతలు. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలు ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించారు ఇప్పటికే విక్రమ్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సినిమాలకి సంగీతాన్ని అందించిన ఇప్పుడు అజిత్ సినిమా కూడా సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమా జనవరి 13న విడుదల కాబోతున్నట్లు సమాచారం.

admin1

admin1

Next Story