Ram Pothineni: ఎనర్జిటిక్ హీరో రామ్‌తో మురగదాస్‌ సినిమా..?

Ghajini Director Muragadas and Energetic Hero Ram Pothineni
x

ఏ.ఆర్. మురగదాస్, యంగ్ హీరో రామ్ పోతినేని (ఫొటో ట్విట్టర్)

Highlights

Ram Pothineni: కోలీవుడ్ డైరెక్టర్ ఏ.ఆర్. మురగదాస్, యంగ్ హీరో రామ్ పోతినేని కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది.

Ram Pothineni: కోలీవుడ్ డైరెక్టర్ ఏ.ఆర్. మురగదాస్, యంగ్ హీరో రామ్ పోతినేని కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. డబ్బింగ్ చిత్రాలైన గజిని, తుపాకి, సెవన్‌త్‌ సెన్స్‌, సర్కార్, దర్బార్ తో ఈ కోలీవుడ్ డైరెక్టర్ తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. అలాగే డైరెక్ట్ గా తెలుగులో 'స్టాలిన్' 'స్పైడర్' వంటి సినిమాలు తీశాడు.

మరోవైపు 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో విజయాన్ని అందుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని.. ఇతర భాషలపై కూడా కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 'రెడ్' చిత్రాన్ని ఇతర భాషల్లో రిలీజ్ చేశాడు ఈ యంగ్ హీరో. ఈ నేపథ్యంలో మురగదాస్, రామ్‌ కాంబోలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

ఇటీవలే రామ్ కు ఈ క్రేజీ డైరెక్టర్ స్క్రిప్ట్‌ వినిపించాడని టాక్. అయితే, ఈ స్టోరీ రామ్‌కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ పూర్తైన తరువాత... అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు లింగుస్వామి డైరెక్షన్‌లో రామ్ నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ లో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories