'ఆచార్య‌'కు జెమినీ షాక్‌.. తల పట్టుకున్న కొరటాల?

Gemini Tv Give Shock To Acharya Makers
x

‘ఆచార్య‌’కు జెమినీ షాక్‌.. తల పట్టుకున్న కొరటాల?

Highlights

Gemini Tv: అప్పటిదాకా వరుస సూపర్ హిట్లతో సజావుగా సాగిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కెరీర్ కి "ఆచార్య" సినిమాతో బ్రేకులు పడ్డాయి.

Gemini Tv: అప్పటిదాకా వరుస సూపర్ హిట్లతో సజావుగా సాగిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కెరీర్ కి "ఆచార్య" సినిమాతో బ్రేకులు పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీగా ప్రీ రిలీజ్ చేసిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ తో అందరికీ షాక్ ఇచ్చింది.

భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచి కొరటాల శివ కెరియర్ లోనే అతిపెద్ద ఫెయిల్యూర్ గా మారింది. ఇక పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిపోయిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు మరియు బయర్లకు కొరటాల శివ అండగా నిలబడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే బయ్యర్లకు 4.7 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించనుండగా మరోవైపు కొరటాలకు పెద్ద ట్విస్ట్ ఎదురైంది.

ఈ సినిమా సాటిలైట్ రైట్స్ 15 కోట్లకు కొనుగోలు చేసిన జెమినీ టీవీ వారు ఇప్పుడు అగ్రిమెంట్ లో అనుకున్న రేట్ ను తగ్గించాలని లేకపోతే అగ్రిమెంటే క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉండడంతో కొరటాలకు పెద్ద షాక్ తగిలింది. ఈ సినిమాని విడుద‌ల‌కు ముందే కొనేసింది జెమినీ. అయితే సినిమా ఫ్లాప‌య్యింది. టీవీల్లో కూడా రేటింగులు రాని ప‌రిస్థితి. రేటింగులు రాక‌పోతే యాడ్లు ఉండ‌వు. అలా ఈ సినిమాతో జెమినీ కూడా న‌ష్ట‌పోవాలి. అందుకే ఇప్పుడు ఆ రూ.15 కోట్లు ఇవ్వ‌డానికి జెమినీ ఒప్పుకోవ‌డం లేదు. అనుకున్న డీల్ ని సగానికి సగం తగ్గించి అంటే ఏడున్నర కోట్ల రూపాయలకి అయితే మేము తీసుకుంటామని చెబుతోందట.

సినిమాని వెనక్కి తీసుకుంటే జెమినీ నుంచి తీసుకున్న అడ్వాన్స్ కూడా వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. లేదా సగానికి సర్దుకుపోవాలి అనుకుంటే ఏడున్నర కోట్ల రూపాయలు నష్టపోవాల్సి ఉంటుంది. మరోవైపు కొరటాల శివ తన తదుపరి సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయాల్సి ఉంది. కానీ "ఆచార్య" ఫైనాన్షియల్ సమస్యల నుంచి బయటపడ్డ తరువాతే తాను కథను వింటానని ఎటువంటి ఇబ్బందులు లేకుండానే సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లాలని కొరటాలకు చెబుతున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories