రామ్ చరణ్ సూపర్ హిట్ సినిమాని రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా గీత ఆర్ట్స్

Ram Charan: రీ రిలీజ్ కి రెడీ అవుతున్న రాజమౌళి బ్లాక్ బస్టర్

Jyothi
Updated on: 29 Jan 2023 7:00 PM IST
Geetha Arts is Planning to Re-Release Ram Charan Super Hit Movie
X

రామ్ చరణ్ సూపర్ హిట్ సినిమాని రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా గీత ఆర్ట్స్

Ram Charan: ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ల ట్రెండు చాలా బాగా నడుస్తుంది. ఇప్పటికే ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన చాలా సినిమాలు మళ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలై సంచలన విజయాలను సృష్టించాయి. మహేష్ బాబు నుంచి పవన్ కళ్యాణ్ దాకా దాదాపు అందరూ స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రీ రిలీజ్ అయ్యి మంచి విజయాలను సాధించాయి. తాజాగా ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కూడా రీ రిలీజ్ కి సిద్ధమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అదే "మగధీర". "చిరుత" సినిమాతో మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ నటించిన రెండవ సినిమా "మగధీర". రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన "జల్సా" సినిమాతో మరొకసారి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది గీతా ఆర్ట్స్ బృందం.

ఈ నేపథ్యంలో మార్చ్ లో రాబోతున్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా "మగధీర" సినిమాని రీ రిలీజ్ చేయాలని గీత ఆర్ట్స్ వారు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ఇండస్ట్రీ హిట్ సినిమా ఎంతవరకు మంచి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సునీల్, శ్రీహరి, సలోని తదితరులు కీలక పాత్రలలో కనిపించారు.

Jyothi

Jyothi

Next Story