Jr NTR: మెగా క్యాంపు లో యంగ్ టైగర్

Jr NTR: ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేస్తున్న గీతాఆర్ట్స్

admin1
Published on: 3 Feb 2022 9:53 AM IST
Geeta Arts is Planning a Movie With Jr NTR | Telugu Movie News
X

Jr NTR: మెగా క్యాంపు లో యంగ్ టైగర్

Jr NTR: విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్ న హీరోహీరోయిన్లుగా నటించిన "గీత గోవిందం" సినిమా బ్లాక్ బస్టర్ అయిన దగ్గర్నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఒక స్టార్ హీరో తో సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురు చూసింది. ఇన్నాళ్ళకి ఒక పెద్ద సినిమా చేయడానికి సిద్ధమయ్యారు అల్లుఅరవింద్. నిజానికి "గీత గోవిందం" సినిమా తర్వాత పరశురామ్ తో అల్లు అరవింద్ మరొక సినిమా చేయాలనుకున్నారు. కానీ పరశురామ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన సినిమాని మొదలు పెట్టేసారు.

ఒకవేళ "సర్కారు వారి పాట" సినిమా బ్లాక్ బస్టర్ అయితే గీత ఆర్ట్స్ పరశురామ్ తో మరో సినిమా చేయడానికి ఏమాత్రం వెనుకాడదు అని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు అల్లు అరవింద్ ఈసారి పరశురామ్ తో చేయబోయే సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను హీరోగా సంప్రదించనున్నారట. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే గీత ఆర్ట్స్ సంస్థ తో ఎన్టీఆర్ చేయబోయే మొదటి సినిమా ఇదే అవుతుంది. పైగా ఎన్టీఆర్ పరశురామ్ వంటి కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ కాంబో ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.

admin1

admin1

Next Story