"ఏ మాయ చేసావే" సినిమా గురించి షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన గౌతం మీనన్

Gautham Menon Revealed a Shocking Thing About the Ye Maaya Chesave Movie
x

"ఏ మాయ చేసావే" సినిమా గురించి షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన గౌతం మీనన్

Highlights

"ఏ మాయ చేసావే" సినిమా గురించి షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన గౌతం మీనన్

Gautham Vasudev Menon: యువ హీరో నాగచైతన్య మరియు స్టార్ బ్యూటీ సమంత అక్కినేని ల కాంబినేషన్లో ప్రేక్షకులు ముందుకి వచ్చిన మొదటి సినిమా "ఏ మాయ చేశావే". గౌతం మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. నాగచైతన్య మరియు సమంత లకు ఈ సినిమా తమ కరియర్లలో మర్చిపోలేని బ్రేక్ ని ఇచ్చింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గౌతమ్ మీనన్ సినిమా గురించిన ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేశారు గౌతమ్ మీనన్. నిజానికి ఈ సినిమా కోసం ముందుగా నాగచైతన్యా ను కాకుండా వేరే హీరోని అనుకున్నారట. ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో మహేష్ బాబు హీరోగా మంజుల కాంబినేషన్లో ఒక సినిమా తీయాల్సి ఉంది అది ఏమైంది అని అడగగా "ఆ సినిమానే ఏ మాయ చేసావే. అది తర్వాత నాగచైతన్యతో చేశాను" అని షాకింగ్ విషయాల్ని తెలియజేశారు గౌతమ్ మీనన్. ఈ నేపథ్యంలో నిజంగా "ఏ మాయ చేసావే" సినిమాలో మహేష్ బాబు ఉంటే ఎలా ఉంటుందో అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమాతో బిజీగా ఉండగా మరోవైపు మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా, రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమా చేయాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories