Gautham Menon: కామెడియన్ తో సినిమా ప్లాన్ చేసిన గౌతమ్ మీనన్

Gautham Menon: కామెడియన్ తో సినిమా ప్లాన్ చేసిన గౌతమ్ మీనన్

admin1
Updated on: 15 Feb 2022 1:42 PM IST
Gautham Menon Planned the Film with a Comedian | Telugu Movie News
X

కామెడియన్ తో సినిమా ప్లాన్ చేసిన గౌతమ్ మీనన్

Gautham Menon: సౌత్ సినీ ఇండస్ట్రీ లో ఫీల్ గుడ్ ప్రేమకథలు తీయడంలో గౌతమ్ మీనన్ ముందే ఉంటారు. ఒకవైపు ప్రేమకథలు మాత్రమేకాక మరోవైపు భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండే పోలీస్ డ్రామాలు తీయడంలో కూడా గౌతమ్ దిట్ట అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటిదాకా గౌతమ్మీనన్ ట్రై చేయని జోనర్ ఉంది అంటే అది కామెడీ. కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు గౌతమ్ మీనన్ కామెడీ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గౌతమ్ మీనన్ ఒక కామెడీ ఫిలిం చేయబోతున్నట్లు ప్రకటించారు.

"ప్రముఖ తమిళ్ కమెడీయన్ వడివేలు తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాను. ప్రస్తుతం ఆయనతో డిస్కషన్స్ జరుగుతున్నాయి. సినిమా చాలా బావుంటుంది. ఈ సినిమాతో వడివేలు అందరినీ ఇంప్రెస్ చేస్తారు" అని చెప్పుకొచ్చారు గౌతమ్ మీనన్. చాలా కాలం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నారు వడివేలు. అందులోనూ గౌతమ్ మీనన్ డైరెక్షన్లో కాబట్టి ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మరోవైపు గౌతమ్ మీనన్ ఒక తమిళ సినిమాతో బిజీగా ఉన్నారు. శింబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story