Gauri Khan: ఆర్యన్ ఖాన్ కోసం వంట విషయంలో నిర్ణయం తీసుకున్న గౌరీఖాన్

* ఆర్యన్ బయటకు వచ్చేదాకా ఇంట్లో స్వీట్లు వండద్దు అంటున్న గౌరీ ఖాన్

admin1
Updated on: 20 Oct 2021 8:31 PM IST
Gauri Khan Ordered to Cooking Staff that Sweets Should Not be Cooked in the Kitchen upto Aryan Khan Returns
X

 ఆర్యన్ ఖాన్ కోసం వంట విషయంలో నిర్ణయం తీసుకున్న గౌరీఖాన్(ఫైల్ ఫోటో)

Gauri Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ నౌకా డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. గత రెండు వారాలుగా ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ కస్టడీలో ఉన్నాడు. ప్రస్తుతం ఆర్యన్ ఆర్థర్‌ రోడ్ లోని సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ కుటుంబంలో విషాదం అలుముకుంది. అతడికి త్వరగా బెయిల్ వచ్చి బయటికి రావాలని తల్లి గౌరీ పూజలు చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఆర్యన్ తిరిగి వచ్చేదాకా ఇంట్లో స్వీట్లు వడద్దు అని గౌరీ సిబ్బందికి ఆర్డర్ వేసినట్లు సమాచారం అందుతోంది.

షారుక్ ఖాన్ నివాసం మన్నత్ లో మధ్యాహ్న భోజనానికి వంట సిబ్బంది ఖీర్ వండారు. అది చూసిన గౌరీఖాన్ వెంటనే కిచెన్ లోకి వెళ్లి దాన్ని ఆపారు. ఆర్యన్ బయటకు వచ్చేదాకా స్వీట్లు మన్నత్ కిచెన్లో స్వీట్లు వండరాదని గౌరీ ఖాన్ ఆదేశించింది. సిబ్బంది నుండి ఒకరు మీడియాకి ఈ విషయాన్ని తెలిపారు. ఇంతకుముందు ఏ పండుగ వచ్చినా షారుక్ ఖాన్ ఇల్లు కళకళలాడిపోతోంది. కానీ ఆర్యన్ ఖాన్ జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారి ఇల్లు వెలవెలబోతోంది. నవరాత్రి సమయంలో కూడా గౌరీఖాన్ నిరంతరం తన కొడుకు ఇంటికి రావాలని పూజలు చేసినట్లు సమాచారం.

admin1

admin1

Next Story