logo
సినిమా

జీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు

Garuda Vega Producer Koteswara Raju, Hema Slams Jeevitha Rajasekhar
X

జీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు

Highlights

Jeevitha Rajasekhar: "పీ ఎస్ వీ గరుడ వేగ" సినిమా లావాదేవీలకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.

Jeevitha Rajasekhar: "పీ ఎస్ వీ గరుడ వేగ" సినిమా లావాదేవీలకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. జీవిత - రాజశేఖర్ అప్పు ఎగ్గొట్టడానికి పాల్పడినట్టు జ్యోస్టార్ ఎంటర్టైన్మెంట్స్ నుండి కోటేశ్వర రాజు మరియు హేమ ఆరోపిస్తున్నారు. తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జీవిత ఒక సైలెంట్ కిల్లర్ అని, ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తున్నారని కోటేశ్వర రాజు మరియు హేమ కామెంట్స్ చేశారు. ''జీవిత రాజశేఖర్ ఒక మహానటి. ఆమె మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. అబద్ధాలతో పెద్ద మనుషుల పేర్లతో ప్రజలను మోసం చేయటం ఆవిడ నైజాం'' అని మండిపడ్డారు.

''మొదట్లో అసలు మేము ఎవరో కూడా తెలీదన్న ఆమె నిన్న మా గురించి హద్దులు మీరి మాట్లాడారు. మేము పరువు గల కుటుంబం నుంచి వచ్చాము. మా ఆయన కోటేశ్వరరాజు యూఎస్ లో అవార్డు గ్రహీత కూడా. నేను యూకేలో ఇక హైలీ పెయిడ్ ప్రొఫెసర్ ని. జీవిత రాజశేఖర్.. నీ నోరు అదుపులో పెట్టుకో. సెలబ్రిటీల జీవితం సామాన్యు జీవితం అని వేరుగా ఉంటుందా? సెలబ్రిటీ పేరుతో మోసాలు చేస్తున్నవు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు" అని హేమ జీవిత పై ఆగ్రహం వ్యక్తం చేశారు. "గరుడవేగ సినిమాకు సంబంధించిన డబ్బు ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదని ఆధారాలతో సహా మేము కోర్టులో సమర్పించాము. మేము కచ్చితంగా కోర్టులో కేసు గెలిచి తీరుతాం" అని అన్నారు హేమ.

Web TitleGaruda Vega Producer Koteswara Raju, Hema Slams Jeevitha Rajasekhar
Next Story