Varun Tej: మెగా హీరోతో జోడీ కట్టనున్న 'గరుడ వేగ' డైరెక్టర్?

Varun Tej: 'పీఎస్‌వీ గరుడ వేగ' ఫేమ్‌ ప్రవీణ్ సత్తారు.. తమన్నాతో 'లెవన్త్ అవర్' అనే వెబ్ సిరీస్ తో ముందుకు వచ్చాడు.

Venkata Chari
Published on: 20 May 2021 6:42 PM IST
Garuda Vega Director to Join Hands With a Mega Hero Varun Tej | Tollywood New Movies
X

ప్రవీణ్ సత్తారు (ఫొటో ట్విట్టర్)

Varun Tej: 'పీఎస్‌వీ గరుడ వేగ' ఫేమ్‌ ప్రవీణ్ సత్తారు.. తాజాగా తమన్నా ప్రధాన పాత్రలో 'లెవన్త్ అవర్' అనే వెబ్ సిరీస్ తో ముందుకు వచ్చాడు. అయితే ఇది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందనే టాక్ నడుస్తోంది.

అయితే, ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం కింగ్ నాగార్జునతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా మెగా హీరోతో మరో ప్రాజెక్టు చేయనున్నట్లు పుకార్లు వెలువడుతున్నాయి. ప్రవీణ సత్తారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఓ క్రీజీ ప్రాజెక్టును తెరకెక్కించునున్నట్లు సమాచారం. వరుణ్ తేజ్ ప్రస్తుతం 'గని', 'ఎఫ్ 3' సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాకే ప్రవీణ సత్తారు ప్రాజెక్టు మొదలుకానున్నట్లు తెలుస్తోంది.

యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుందని, ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాదే షూటింగ్ మొదలుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక సమాచారం మాత్రం విడుదల కాలేదు.

Venkata Chari

Venkata Chari

Next Story