అతడ్ని చంపినట్లే నిన్ను చంపేస్తాం.. సల్మాన్ ఖాన్‌కు వార్నింగ్..

Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ లకు బెదిరింపు లేఖ ప్రత్యక్షమైంది.

Arun Chilukuri
Updated on: 6 Jun 2022 9:15 PM IST
Gangster Lawrence Bishnoi Threatened kill Salman Khan
X

అతడ్ని చంపినట్లే నిన్ను చంపేస్తాం.. సల్మాన్ ఖాన్‌కు వార్నింగ్..

Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ లకు బెదిరింపు లేఖ ప్రత్యక్షమైంది. సలీంఖాన్ ఇవాళ మార్నింగ్ వాక్ వెళ్లిన సమయంలో పార్కులోని బెంచీ మీద అజ్ఞాత మనిషి ఓ లెటర్ వదిలి వెళ్లాడు. అనుమానాస్పదంగా కనిపించిన ఆ లెటర్ ను సలీంఖాన్ విప్పి చూశాడు. కాంగ్రెస్ నేత, బాలీవుడ్ సింగర్ సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే నీక్కూడా పడుతుందని ఆ లేఖలో రాసి ఉంది. దీంతో సలీంఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విషయం తెలియగానే సల్మాన్ ఖాన్, సలీంఖాన్ ఇంటివద్ద ముంబై పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. లేఖ ఎవరు రాశారా అన్న కోణంలో సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. లేఖ ద్వారా సల్మాన్ ను టార్గెట్ చేశారా లేక సలీంను టార్గెట్ చేశారా అన్నది కూడా ఇంకా తెలియలేదు. అయితే జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గతంలో సిద్ధూ మూసేవాలాను చంపుతామని బెదిరించారు. ఇటీవల సిద్ధూ హత్యకు గురయ్యాడు. ఈ క్రమంలో సల్మాన్ అండ్ సలీంలకు భద్రత పెంచారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story