Gangotri Fame: 'గంగోత్రి' వల్లంకి పిట్ట ఏం చేస్తుందో తెలుసా!

Gangotri Fame: ఈ సినిమా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 100వ చిత్రం కాగా.. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తొలి చిత్రం

Samba Siva Rao
Published on: 4 May 2021 1:43 PM IST
Gangotri Fame Kavya Back to Movies as Heroine
X

గంగోత్రి నటి కావ్య 

Gangotri Fame: తెలుగులో ఎవ‌ర్ గ్రీన్ చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ సినిమాలు ఇప్పుడు టీవీలో వ‌చ్చినా మ‌ళ్లీమ‌ళ్లీ చూస్తారు. వాటిలో ఒక‌టి బన్నీ న‌టించిన గంగోత్రి మూవీ ఒక‌టి. ఈ చిత్రానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఈ సినిమా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 100వ చిత్రం కాగా.. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తొలి చిత్రం. అశ్వనీదత్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించారు. ఎమ్‌ఎమ్‌ కీరవాణి అందించిన పాటలు హైలెట్ గా నిలిచాయి. ఈ చిత్రంలో సాంగ్స్ సంగీత ప్రియుల‌కు ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌తిపాట విన‌సొంపుగా ఉన్నాయి. ప్ర‌తి గీతం ఓ మ‌ధురం.

అయితే చిత్రంలోని వల్లంకి పిట్ట పాటకు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఈ పాటలో నటించిన చిన్నారి కావ్యకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా త‌ర్వాత కావ్య‌కు ఆఫ‌ర్లు క్యూక‌ట్టాయి. ప్ర‌తి సినిమాలో చిన్న‌పిల్ల‌ల క్యారెక్ట‌ర్ అంటే కావ్య‌తోనే చేయించాలని అనేంతగా కావ్య‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌చ్చింది.

అయితే గంగోత్రి సినిమా వ‌చ్చి 18 ఏళ్లు అవుతుంది. అందులో న‌టించిన కావ్య ఇప్పుడు ఎలా ఉంది. ఎం చేస్తుందో తెలుసుకోవాల‌ని అభిమానులు ఎంత‌గానో ఆత్రుత‌గా ఉన్నారు. ఇప్పడు 22 ఏళ్ల వయసున్న కావ్య త్వరలోనే హీరోయిన్‌గా రీఎంట్రీ ఇవ్వాలని టాక్. దీంతో సోష‌ల్ మీడియాలో కావ్య ఫోటోలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఒకప్పటి చిన్నారి పాపలంతా ఇప్పుడు హీరోయిన్లు అవుతున్నారు. న ఓ దర్శకుడు ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ పాత్ర చేసినా ఒక నటిగా తనకు అది ఉపయోగపడాలని, అలాగే తానూ ప్రాజెక్ట్‌కి ఉపయోగపడాలని కావ్య చెప్పింది. గతంలో కావ్య ఓటిటి లో నటించేందుకు ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కావ్య హీరోయిన్ గా మళ్లే వెండి తెరమీద చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story