Gaddar Film Awards 2026: గద్దర్ ఫిలిం అవార్డ్స్ విజేతలు వీరే: మెగాస్టార్‌కు 'ఎన్టీఆర్' పురస్కారం.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య!

Gaddar Film Awards 2026: గద్దర్ ఫిలిం అవార్డ్స్ విజేతలు వీరే: మెగాస్టార్‌కు 'ఎన్టీఆర్' పురస్కారం.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య!
Gaddar Film Awards 2026: సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ సినీ రంగంలో మళ్లీ అవార్డుల సందడి మొదలైంది.
Gaddar Film Awards 2025 Winners List: సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ సినీ రంగంలో మళ్లీ అవార్డుల సందడి మొదలైంది. ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 'గద్దర్ ఫిలిం అవార్డ్స్-2025' విజేతల జాబితాను జ్యూరీ అధికారికంగా వెల్లడించింది. జ్యూరీ చైర్మన్, ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ తుది జాబితాను సభ్యులు శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అందజేశారు.
మెగాస్టార్‌కు గౌరవం.. చైతూకు ఉత్తమ నటుడు అవార్డు:
ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు మెగాస్టార్ చిరంజీవి ఎంపికయ్యారు. అలాగే, విలక్షణ నటి జయసుధను అక్కినేని నాగేశ్వరరావు (ANR) పురస్కారంతో గౌరవించనున్నారు. 'తండేల్' చిత్రంలో అద్భుత నటన కనబరిచిన యువ సామ్రాట్ నాగచైతన్యను 'ఉత్తమ నటుడు' అవార్డు వరించగా.. 'రాజ్ వెడ్స్ రాంబాయి' చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచింది.
14 ఏళ్ల తర్వాత పునఃప్రారంభం:
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నంది అవార్డుల స్థానంలో, దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో ఈ అవార్డులను పునఃప్రారంభించింది. మొత్తం 17 విభాగాల్లో ఈ పురస్కారాలను అందజేస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా సామాజిక స్పృహ కలిగిన చిత్రాలకు అవార్డులతో పాటు డాక్టర్ సినారే (C. Narayana Reddy) పేరిట కూడా ప్రత్యేక పురస్కారాన్ని ప్రవేశపెట్టారు.
అట్టహాసంగా జరిగిన జ్యూరీ సమావేశం:
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో జరిగిన ఈ సమావేశంలో జ్యూరీ సభ్యులుగా ఉన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నటుడు తనికెళ్ల భరణి, సీనియర్ నటి రోజా రమణి, ప్రగతి, మణిశర్మ తదితరులు పాల్గొన్నారు. పారదర్శకంగా, అర్హత కలిగిన వారికే అవార్డులు దక్కేలా ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు జ్యూరీ సభ్యులు తెలిపారు. త్వరలోనే అట్టహాసంగా జరిగే వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ తుది జాబితా:
ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి – రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం – ది ప్రీ వెడ్డింగ్ షో
నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా – తండేల్
ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా
ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ – లిటిల్ హార్డ్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం – కోర్టు
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్
ఉత్తమ బాలల చిత్రం – అనగనగనా
ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ సపోర్టింగ్ నటుడు – శివాజీ
ఉత్తమ సపోర్టింగ్ నటి- భూమిక
ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె రాబిన్ (దండోరా)
ఉత్తమ నేపథ్య గాయకుడు – అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నేపథ్య గాయని – సాహితి చాగంటి (కన్నప్ప)
ఉత్తమ హాస్యనటుడు – కృష్ణ తేజ (జిగ్రీస్)
ఉత్తమ బాలనటుడు – రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో)
ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ – అనిల్ రావిపూడి
ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
ఉత్తమ ఎడిటర్- శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్ – ఎం.ఆర్ రాధాకృష్ణన్ కిష్కిందపురి
ఉత్తమ కొరియోగ్రాఫర్ – గిర గిర గిర
ఉత్తమ ఆర్ట్ డైరక్టర్ – తోట తరణి ఛాంపియన్
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – గోవింద్ అఖండ
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – చాంపియన్ – చంద్రకాంత్
ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిల్మ్ – 23
ఉత్తమ మేల్ యాక్టర్ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నటి – అనంతిక (8 వసంతాలు)
స్పెషల్ జ్యూరీ హీరో – రోషన్ (చాంపియన్)
పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు – కమల్ హాసన్
బి.ఎన్.రెడ్డి ఫిల్మ్ అవార్డు – సింగీతం శ్రీనివాసరావు
గిరెడ్డి అండ్ చక్రపాణి అవార్డు – చలసాని అశ్వనీదత్
కాంతారావు అవార్డు – ఆర్ నారాయణమూర్తి
రఘుపతి వెంకయ్య అవార్డు – రమేష్ ప్రసాద్ (ప్రసాద్ ల్యాబ్స్)
సి. నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డు – సుద్దాల అశోక్ తేజ

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



