దర్శకుడి అవతారం ఎత్తనున్న పాపులర్ కొరియోగ్రాఫర్

Ruthvik
Updated on: 21 May 2019 1:35 PM IST
దర్శకుడి అవతారం ఎత్తనున్న పాపులర్ కొరియోగ్రాఫర్
X

గబ్బర్ సింగ్ సినిమాలో 'దేఖో దేఖో గబ్బర్ సింగ్' అనే పాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేసిన అదిరిపోయే స్టెప్పులు అభిమానులు ఎప్పటికి మర్చిపోలేరు. ఆ పాటకి కొరియోగ్రఫీ చేసిన గణేష్ మాస్టర్ కి తెలుగులో మంచి కొరియోగ్రాఫర్ గా పేరుంది. అయితే తాజాగా గణేష్ మాస్టర్ దర్శకత్వం వైపు మొగ్గు చూపుతున్నారని పుకార్లు బయటకు వచ్చాయి. గణేష్ మాస్టర్ త్వరలో ఒక సినిమా కి దర్శకత్వం వహించబోతున్నారని వార్తలు బయటకు వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

ఇప్పటికే కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టి దర్శకుడిగా మారిన వారిలో ప్రభుదేవా రాఘవ లారెన్స్ వంటి సార్లను చూసాము ఇప్పుడు గణేష్ మాస్టర్ కూడా వారి బాటలోనే నడవాలని అనుకుంటున్నారట. గణేష్ మాస్టర్ తలుచుకుంటే దర్శకుడిగా మారడం అంత కష్టమైన పనేమీ కాదు. ఎందుకంటే గణేష్ మాస్టర్ కు స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తదితరులతో మంచి పరిచయాలు ఉన్నాయి. అంతేకాక లీడింగ్ నిర్మాతలతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న గణేష్ మాస్టర్ దర్శకుడి గా మారాలి అనుకుంటే వారంతా అతనికి మద్దతు పలుకుతారు. దీని గురించి అధికారిక ప్రకటన రెండు నెలల్లో వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Ruthvik

Ruthvik

Next Story