Gaali Sampath Movie: 'గాలి సంపత్‌' ఓటీటీ రిలీజ్ ఫిక్స్..?

Gaali Sampath Movie: టాలీవుడ్‌ చిత్రాలన్ని ఇప్పుడు కొత్తదారిని ఎంచుకున్నాయి. సినిమాలు విడుదలై నెల రోజుల కూడా కాకుండానే చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఓటీటీల బాటపడుతున్నాయి.

Samba Siva Rao
Published on: 17 March 2021 11:38 AM IST
Gaali Sampath Movie Release on Aha OTT on 19th March 2021
X

Gaali Sampath Movie on Aha

Gaali Sampath Movie: టాలీవుడ్‌ చిత్రాలన్ని ఇప్పుడు కొత్తదారిని ఎంచుకున్నాయి. సినిమాలు విడుదలై నెల రోజుల కూడా కాకుండానే చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఓటీటీల బాటపడుతున్నాయి. ఈ ఏడాది 'క్రాక్' మూవీతో మొదలైన ఈ తంతు చిన్న సినిమాలకు పాకింది. గత ఏడాది కరోనాతో చాలా వరకు సినిమాలు ఓటీటీల రిలీజ్ అయ్యాయి. కరోనా తర్వాత పరిస్థితులు కుదుటపడ్డాక మూవీలు వరుస పెట్టి విడదుల అవుతున్నాయి. అయితే గతంలో కంటే ఇప్పుడు సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో సినిమాలు థియేటర్లలో విడుదల చేసిన 20 రోజులకే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి.

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'క్రాక్', 'రెడ్', 'అల్లడు అదుర్స్' వంటి చిత్రాలు నెలలోపే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అయ్యాయి. హిట్ కోసం చాలా కాలంగా ఎదుచూసి ఎట్టకేలకు 'నాంది' చిత్రంతో పర్వాలేదనిపించిన అల్లరి నరేశ్ కూడా తన మూవీని ఈ నెల 12న ఓటీటీల్లో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో తెలుగు చిత్రం ఓటీటీ బాట్టింది.

శ్రీ విష్ణు, రాజేంద‌ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా.. సూపర్ హిట్ చిత్రాల డైరెక్టర్‌ అనిల్ రావిపూడి సమర్పకుడిగా, ఆ‍యన స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం 'గాలిసంప‌త్'. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం(మార్చి11) ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా అప్పుడే ఓటీటీ బాట పట్టింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ఆహాలో మార్చి 19న రిలీజ్‌ కానుంది. ఇందుకోసం ఆహా టీమ్‌ చిత్రయూనిట్‌తో మంచి డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

'గాలి సంపత్‌'లో లవ్‌లీ సింగ్‌ హీరో హీరోయిన్‌గా నటించింది. అనీష్‌ దర్శకత్వం వహించగా..ఎస్‌. కృష్ణ, సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించారు. గాలి సంపత్ సినిమాకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. సినిమా కమర్షియల్‌గా మాత్రం హిట్టవలేదు. జాతిరత్నాలు,శ్రీకారం నుంచి పోటీని తట్టుకోలేక చతికిలపడింది. దాంతో నిర్మాతలు ఓటీటీ రిలీజ్‌కు మొగ్గు చూపారు. ఫలితంగా సినిమా రిలీజై పట్టుమని పది రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వస్తుండటం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story