Gaali Sampath: బ్లాక్ బస్టర్ బొమ్మ.. ట్విట్టర్ రివ్యూ

Gaali Sampath: 'గాలి సంపత్'కు అనిల్ రావిపూడి సినిమాకు స్క్రీన్‌ప్లే అందించి, దర్శకత్వ పర్యవేక్షణ చేశారు.

Samba Siva Rao
Updated on: 11 March 2021 8:33 AM IST
Gaali Sampath movie Released On Today
X

గాలి సంపత్ ఫైల్ ఇమేజ్ 

Gaali Sampath: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ శుక్రవారం టాలీవుడ్ లో వరుసగా నాలుగు చిత్రాలు విడుదల అవుతున్నాయి. వీటిలో మూడు సినిమాలు.. శర్వానంద్ నటించిన'శ్రీకారం', నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ నటించిన 'జాతిరత్నాలు' 'జాతిరత్నాలు', శ్రీ విష్ణు 'గాలి సంపత్', డబ్బింగ్ మూవీ 'రాబర్ట్'(దర్శన్ , జగపతి బాబు) ఉంది.

అయితే శ్రీకారం, జాతిరత్నాలు, గాలిసంపత్ చిత్రాపై అంచలనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలన్ని ప్రచారం ఓ రేంజ్ లో చేశాయి. 'శ్రీకారం' సినిమాకు చిరంజీవి ప్రచారం కల్పించగా.. 'జాతిరత్నాలు' సినిమా ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ వచ్చారు. అలాగే, 'గాలి సంపత్'కు రామ్ ప్రచారం కల్పించారు. అయితే, 'గాలి సంపత్'కు సినిమాకు అనిల్ రావిపూడి ఇమేజ్ పెద్ద ప్లాస్ పాయింట్.

సూపర్ హిట్ చిత్రాల డైరెక్టర్‌గా మారిన అనిల్ రావిపూడి సమర్పకుడిగా.. వస్తున్న 'గాలి సంపత్' ఆయన సినిమాకు స్క్రీన్‌ప్లే అందించి, దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి మిత్రుడు కో-డైరెక్టర్‌గా, రచయితగా ఎస్.కృష్ణను ఈ సినిమా ద్వారా నిర్మాతగా పరిచయం అవుతున్నారు‎. రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాలో శ్రీవిష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లు. అచ్చు రాజమణి సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, కొంత మంది సినీ ప్రముఖులకు ఈరోజు 'గాలి సంపత్' సినిమా ప్రీమియర్ షో వేసి చూపించారు. ఈ సినిమా చూసిన ప్రముఖులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గాలి సంపత్ సినిమా చూశాను. కామెడీ, ఎమోషనల్ రైడ్‌తో కూడిన ఒక యూనిక్ స్టోరీ ఇది. నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా నటించారు. ఆయన చేసిన మూగ కామెడీ చాలా బాగుంది. అనిల్ రావిపూడి తనదైన శైలిలో సినిమాను తెరకెక్కించారు. అంటూ దర్శకుడు మెహర్ రమేష్ కూడా 'గాలి సంపత్' సినిమా చూసి స్పందించారు.

'ప్రేమ ఇష్క్ కాదల్', 'సావిత్రి' చిత్రాల దర్శకుడు పవన్ సాదినేని.. 'గాలి సంపత్' సినిమాపై ట్విట్ చేశారు.''ఈ టీమ్ నుంచి ఇలాంటి సినిమా వచ్చిందంటే నమ్మలేకపోతున్నా. అనిల్ రావిపూడి నుంచి ఇలాంటి సినిమా రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రీవిష్ణు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి మధ్య ఎమోషన్స్ అద్భుతం. ప్రతి ఒక్కరూ తెరపై ఒక మాయాజాలాన్ని చూస్తారు.''అని ట్వీట్ చేశారు.







Samba Siva Rao

Samba Siva Rao

Next Story