'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వాలి.. అంబటి రాంబాబు షాకింగ్ ట్వీట్..

Former YSRCP MLA Ambati Rambabu Tweet On Hari Hara Veera Mallu Movie
x

'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వాలి.. అంబటి రాంబాబు షాకింగ్ ట్వీట్..

Highlights

Hari Hara Veera Mallu: తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియా మళ్లీ మొదలైంది.

Hari Hara Veera Mallu: తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియా మళ్లీ మొదలైంది. ఆయన కథానాయకుడిగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరి హర వీరమల్లు’ నేడు ప్రీమియర్ షోలు ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి క్రిష్ మరియు ఎం ఎం జ్యోతి కృష్ణ కలిసి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మించారు. పవన్ కళ్యాణ్‌ను వెండితెరపై మళ్లీ చూడాలన్న ఫ్యాన్స్ క్రేజీతో థియేటర్ల వద్ద ఆల్రెడీ హంగామా చేస్తున్నారు.

ఇదే సమయంలో, వైసీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్‌పై వైసీపీ తరఫున తరచూ విమర్శలు గుప్పించే అంబటి రాంబాబు.. ఈసారి ఊహించని పంథాలో స్పందించారు.

ఆయన తన ఎక్స్ (Twitter) ఖాతా ద్వారా ఇలా ట్వీట్ చేశారు

‘ పవన్ కళ్యాణ్ గారి “హరిహర వీర మల్లు” సూపర్ డూపర్ హిట్టై కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవైపు వైసీపీ నాయకులు పవన్ సినిమాకోసం టికెట్ ధరలు పెంచారని విమర్శలు చేస్తున్నప్పటికీ, అంబటి రాంబాబు ఇలా ప్రశంసించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రాజకీయపరంగా విభేదాలు ఉన్నా, సినిమాల విషయంలో అభిమాన భావాలు వెలిబుచ్చడం అరుదైన విషయం. అంబటి రాంబాబు ట్వీట్‌ను పవన్ అభిమానులు స్వాగతిస్తున్నారు. సోషల్ మీడియాలో అతనికి ధన్యవాదాలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. "రాజకీయాలు వేరైనా, సినిమా అభిమానం వేరే" అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories