రాజమౌళి బాటలో సుకుమార్.. ఫారిన్ బ్యూటీ ని రంగంలోకి..

Foreign Girl in Pushpa: The Rule
x

రాజమౌళి బాటలో సుకుమార్.. ఫారిన్ బ్యూటీ ని రంగంలోకి..

Highlights

Pushpa: The Rule: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లందరూ ఫారెన్ బ్యూటీ లపై కన్నేశారు.

Pushpa: The Rule: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లందరూ ఫారెన్ బ్యూటీ లపై కన్నేశారు. ఈ మధ్యనే "ఆర్ ఆర్ ఆర్" సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరిస్ ను ఎన్టీఆర్ కి జతగా రంగంలోకి దింపారు. తాజాగా ఇప్పుడు రాజమౌళి బాటలో మరొక డైరెక్టర్ చేరనున్నారు. ఆయనే స్టార్ డైరెక్టర్ సుకుమార్.

ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప: ది రైజ్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ను సౌత్ ఈస్ట్ ఏసియా లోని సింగపూర్, తైవాన్, చైనా లేదా జపాన్ దేశాలలో చేయాలని అనుకుంటున్నారు సుకుమార్. ఆ సమయంలో పుష్ప రాజ్ పాత్ర ఒక ఫారిన్ అమ్మాయికి దగ్గర అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంలో అల్లు అర్జున్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉందట. అయితే సుకుమార్ మాత్రం ఫారెన్ బ్యూటీ తో జరిగే ఈ కొత్త లవ్ ట్రాక్ వర్కౌట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట. ఏదేమైనా "పుష్ప: ది రూల్" పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories