Singer Mangli: సింగ‌ర్ మంగ్లీ బ‌ర్త్‌డే పార్టీలో గంజాయి క‌ల‌క‌లం..!

Folk Singer Mangli Birthday Drugs Bust
x

Singer Mangli: సింగ‌ర్ మంగ్లీ బ‌ర్త్‌డే పార్టీలో గంజాయి క‌ల‌క‌లం..!

Highlights

Singer Mangli: ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదైంది.

Singer Mangli: ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదైంది. ఇటీవల చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో ఆమె పుట్టిన రోజు వేడుకలు నిర్వహించగా, అక్కడ గంజాయి వాడకం జరిగిందని గుర్తించిన పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఈ పార్టీకి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. దివి, కాసర్ల శ్యామ్, రచ్చ రవి, సింగర్ ఇంద్రావతి వంటి సెలెబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

అయితే, పార్టీ సమయంలో కొంతమంది గంజాయి వినియోగించుతూ పట్టుబడ్డారు. అంతేకాకుండా విదేశీ మద్యం కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి విచారణ కొనసాగుతుండగా, దీనిపై మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories