Gaddar: "ఆచార్య"లో కనిపించనున్న ప్రజాగాయకుడు..!?

* చిరంజీవి సినిమాలో కనిపించనున్న గద్దర్

admin1
Updated on: 31 Aug 2021 3:22 PM IST
Folk Singer Gaddar Playing a Role in Chiranjeevi Acharya Movie
X

చిరంజీవి సినిమాలో నటించనున్న గద్దర్ (ఫైల్ ఫోటో)

Chiranjeevi - Gaddar: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "ఆచార్య". రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మించడం మాత్రమే కాక ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కూడా పోషించనున్నారు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, పూజా హెగ్డే రామ్ చరణ్ సరసన ఒక కీలక పాత్ర పోషించింది. మెగా స్టార్ మరియు రామ్ చరణ్ ఈ సినిమాలో నక్సలైట్లు గా కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించేందుకు ప్రముఖ గాయకుడిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

అతను ఎవరో కాదు గద్దర్. ప్రజా గాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గద్దర్ అభ్యుదయ భావాలున్న సినిమాలకు పాటలు అందించడంలో ముందుంటారు. కొన్ని చిత్రాలలో నటించిన గద్దర్ ఇప్పుడు "ఆచార్య" సినిమాలో కూడా కనిపించనున్నారట. ప్రస్తుతం గద్దర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. మెగాస్టార్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. కాబట్టి ఈ సినిమాలో చిరంజీవి మరియు గద్దర్ కి మధ్య కొన్ని సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. అక్టోబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని చిరంజీవి భావిస్తున్నారు కానీ కొందరు మాత్రం సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుందని చెబుతున్నారు.

admin1

admin1

Next Story