Keerthy Suresh: సొంత బ్యానర్లో మొట్టమొదటి సారిగా కీర్తి సురేష్

*తన తండ్రితో సినిమా చేస్తున్న కీర్తి సురేష్

admin1
Updated on: 22 Nov 2021 11:15 AM IST
First time Keerthy Suresh Acting in Film in his Own Production Company
X

తన తండ్రితో సినిమా చేస్తున్న కీర్తి సురేష్(ఫైల్ ఫోటో)

Keerthy Suresh New Movie: "మహానటి" సినిమా తర్వాత కీర్తి సురేష్ కెరీర్ బాగా మారిపోయింది. వరుస సినిమాలతో బిజీ అయిపోయింది కీర్తి. తెలుగులో మాత్రమే కాక తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది కీర్తి సురేష్. మలయాళంలో "వాషి" అనే సినిమాని మొదలు పెట్టింది.

అయితే ఇప్పటిదాకా కీర్తి సురేష్ చేసిన అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమా ఆమెకు చాలా ప్రత్యేకం కాబోతోంది. ఎందుకంటే ఈ సినిమాను నిర్మిస్తోంది కీర్తి సురేష్ సొంత నిర్మాణ సంస్థ. ఇది కొత్త నిర్మాణ సంస్థ కాదు. 1980, 1990 ల సమయంలో ఈ ప్రొడక్షన్ బ్యానర్ పై బోలెడు సినిమాలు తెరకెక్కాయి.

ఈ సినిమాల నిర్మాత మరెవరో కాదు కీర్తి సురేష్ తండ్రి సురేష్. ఆయన మలయాళంలో పెద్ద నిర్మాత సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కీర్తి సురేష్ ఈ నిర్మాణ సంస్థ బ్యానర్ లో "పైలెట్స్" అనే ఒక సినిమాలో నటించింది. కానీ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తరువాత కీర్తి సురేష్ ఇప్పటిదాకా నటించింది లేదు.

కానీ చాలా కాలం తర్వాత స్టార్ గా మారిన కీర్తి సురేష్ మొట్టమొదటిసారిగా సొంత నిర్మాణ సంస్థ తో కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇది. టోవినో థామస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. విష్ణు రాఘవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

admin1

admin1

Next Story