అంగరంగ వైభవంగా సాగిన నిహారిక పెళ్లి వేడుక.. నాగబాబు భావోద్వేగం

Arun Chilukuri
Published on: 9 Dec 2020 8:17 PM IST
అంగరంగ వైభవంగా సాగిన నిహారిక పెళ్లి వేడుక.. నాగబాబు భావోద్వేగం
X

కొణిదెల వారి ఆడపడుచు కొత్త పెళ్లి కూతురుగా మారిపోయింది. కుటుంబ సభ్యుల సమక్షంలో నిహారిక కొద్ది సేపటి క్రితం జొన్నలగడ్డ చైతన్యతో ఏడడుగులు వేసింది. జొన్నలగడ్డ కుటుంబ కోడలిగా మారిపోయింది. జైపూర్‌లోని ఉదయ్‌విలాస్‌ ప్యాలెస్‌లో ఈ వివాహం వైభవంగా జరిగింది.

తన గారాలపట్టి నిహారిక పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేసిన మెగా బ్రదర్‌ పాత జ్ఞాపకాలు తలచుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు. ''తను స్కూలుకు వెళ్లిన మొదటి రోజు నాకింకా గుర్తుంది. నా చిన్నారి కూతురు స్కూలుకు వెళ్లేంత పెద్దదై పోయిందనే నిజం నమ్మడానికే నాకు చాలా ఏళ్లు పట్టింది. ఇంకెన్నాళ్లు ఇలాంటి ఫీలింగ్‌ ఉంటుందో.. కాలమే నిర్ణయిస్తుంది'' అంటూ నటుడు నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story