'ఆదిపురుష్' సెట్స్‌లో భారీగా ఎగిసిపడిన మంటలు...తొలిరోజే ఆటకం..

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్'.

Samba Siva Rao
Updated on: 2 Feb 2021 8:31 PM IST
ఆదిపురుష్ సెట్స్‌లో భారీగా ఎగిసిపడిన మంటలు...తొలిరోజే ఆటకం..
X

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్'. ఈ చిత్రం షూటింగ్ తొలిరోజే ఆటకం ఏర్పాడింది. ఈ సినిమా షూటింగ్ మంగళవారం ముంబైలో ప్రారంభమైంది. షూటింగ్ జరుపుకుంటున్న సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని గోరేగావ్‌లో ఉన్న ఇనార్బిట్ మాల్ వెనుక రెట్రో గ్రౌండ్స్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. షూటింగ్‌లో సినిమాకు సంబంధించిన సగం మంది టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సెట్స్‌లో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లేరని చిత్ర యూనిట్‌కు చెందిన ఒకరు వెల్లడించారు. అయితే, సాయంత్రం 4:13 గంటల సమయంలో సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.మంటలను అదుపుచేయడానికి ఎనిమిది ఫైర్ ఇంజిన్లు, ఐదు జంబో ట్యాంకర్లు, ఒక వాటర్ ట్యాంకర్, జేసీబీ రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story