Kangana Ranaut: మరో వివాదంలో కంగనా రనౌత్

*సిక్కులు ఖలిస్తాన్ ఉగ్రవాదులంటూ పోస్ట్ *ముంబైలోని ఖార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

Sandeep Reddy
Updated on: 27 Nov 2021 4:52 PM IST
FIR Filed Against Bollywood Actress Kangana Ranaut About the Controversial Comments on Sikh Community
X

Kangana Ranaut: మరో వివాదంలో కంగనా రనౌత్

Kangana Ranaut: కంగనా రనౌత్‌ మరో వివాదంలో చిక్కుకుంది. తమ మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానిస్తున్నారంటూ సిక్కులు ముంబయిలోని ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కంగనాపై పోలీసు కేసు నమోదు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రైతు చట్టాలు తీసుకొచ్చిన మొదటి రోజు నుంచి రైతుల నుంచి వ్యతిరేకంగా వ్యక్తమవుతుంది. దీనిపై కంగనా స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాలను విమర్శించే వారిపై ఫైర్‌ అయ్యారు.

ఇప్పుడు ప్రధాని మోడీ ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగానూ కంగనా గళం విప్పింది. అంతటితో ఆగకుండా వరుసగా పలువురిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. సిక్కులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఇన్‌స్టాలో పోస్టు చేసింది. సిక్కు సమాజం మొత్తాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులుగా అభివర్ణించింది. మరోవైపు ఇటీవల జాతిపిత మహాత్మా గాంధీపైన కూడా పలు వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలోనూ ఆమెపై కేసు నమోదు చేశారు.

కంగనా చేసిన ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ.. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజీందర్ సింగ్ సిర్సా నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం ముంబైలో సీనియర్ పోలీసు అధికారులను కలిసింది. కంగన పదే పదే సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని.. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. సిక్కుల ఫిర్యాదు మేరకు కంగనా రనౌత్‌పై ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story