సినీనటి రాగిణి విప్పుతున్న డ్రగ్స్ గుట్టు !

సినీనటి రాగిణి విప్పుతున్న డ్రగ్స్ గుట్టు !
x
Highlights

Sandalwood drug case: తీగ లాగితే.. డొంక కదిలినట్లు డ్రగ్స్ కేసులో గుట్టంత బయటకు వస్తోంది. ఎవరి పేరు బయటకు వస్తుందో అని పొలిటికల్, సినీ...

Sandalwood drug case: తీగ లాగితే.. డొంక కదిలినట్లు డ్రగ్స్ కేసులో గుట్టంత బయటకు వస్తోంది. ఎవరి పేరు బయటకు వస్తుందో అని పొలిటికల్, సినీ స్టార్లకు గుబులు పట్టుకుంది. డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి రాగిణి సెలబ్రెటీల బండారాన్ని బయటపెడుతోంది. ఎక్కడ డ్రగ్స్ పార్టీలు జరుగుతాయి. ఎవరెవరు వస్తారు. రెగ్యులర్ గా పార్టీలకు హాజరయ్యే స్టార్ల పేర్లను గుక్క తిప్పుకోకుండా మరీ సీసీబీ పోలీసులకు చెబుతుంది. దీంతో ఎక్కడ తమ పేరు బయటకు వస్తుందో అని భయపడుతున్నారు కొందరు సెలబ్రెటీల పుత్రరత్నాలు.

డ్రగ్స్‌ కేసులో అరెస్టైన నటి రాగిణి అసక్తికర విషయాలు బయటపెడుతుందని సీసీబీ పోలీసులు అంటున్నారు. బెంగళూరులో జరిగే బడా పార్టీలకు డ్రగ్స్‌ సరఫరా చేసే వ్యక్తుల పేర్లను రాబట్టారు సీసీబీ అధికారులు. అలాగే ఇదే కేసులో అరెస్టైన రవిశంకర్, సంజనా, రాహుల్‌ నుంచి పోలీసులు అనేక విషయాలను సేకరించారు. ఈ డగ్స్ పార్టీలకు పొలిటికల్, సినీ సెలబ్రెటీల వారసులతో పాటు ఐపీఎస్‌ అధికారుల పుత్రరత్నాలకు సంబంధాలున్నాయని పక్కా అధారాలు సేకరించారు పోలీసులు.

రాగిణిని విచారించిన సీసీబీ అధికారులు 20 మంది సెలబ్రెటీల పుత్రరత్నాల జాబితాను రెడీ చేశారు. వీరందరికీ త్వరలో నోటీసులు జారీ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ విషయం కాస్త బయటకు రాగానే కొందరు సెలబ్రెటీల వారసులకు వణుకుపుడుతుంది. రాగిణి ఇంట్లో గంజాయిని నింపిన 8 సిగరేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఇతర మత్తు పదార్థాలను కూడా కలిపిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సిగరేట్లను పరిశోధన కేంద్రానికి తరలించారు. డ్రగ్స్‌ కేసులో రాగిణితో పాటు 12 మందిపై కాటన్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1–శివప్రకాశ్, ఏ2గా రాగిణి, ఏ3 గా ఢిల్లీకి చెందిన వీరేన్‌ ఖన్నాను చేర్చారు.

సినీ పరిశ్రమలో డ్రగ్స్ మాఫియా లేదని ఇన్నాళ్లు చెప్పుకచ్చిన చలన చిత్ర వాణిజ్య మండలికి రాగిణి వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ విషయంపై చలనచిత్ర వాణిజ్య మండలి సభ్యులు సుధీర్ఘంగా చర్చించారు. సినీ సెలబ్రెటీల పేర్లు బయటపడితే పరిస్థితి ఎంటని ఎవరికి వారు తలలుపట్టుకుంటున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories