Venky Kudumula: యువ డైరెక్టర్ పై మెగా బాధ్యత

Venky Kudumula: వెంకీ కుడుముల పై పెరిగిన బాధ్యత

admin1
Published on: 19 Dec 2021 3:03 PM IST
Filming with Chiranjeevi increased the responsibility on Venky Kudumula
X

వెంకీ కుడుముల పై పెరిగిన బాధ్యత(ఫైల్-ఫోటో)

Venky Kudumula: ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి చాలా మంది స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయాల్సి ఉంది. ఒకవైపు ఇప్పటిదాకా ఫ్లాప్ అనేది ఎరుగని కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. మెహర్ రమేష్ ఫామ్ లో లేకపోయినప్పటికీ చిరంజీవి ని ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయం బాగా తెలుసు.

అయితే తాజాగా చిరంజీవి వెంకీ కుడుముల తో సినిమా సైన్ చేశారు. నాగ శౌర్య హీరోగా "ఛలో" సినిమాతో దర్శకుడిగా మారిన వెంకీ కుడుముల నితిన్ హీరోగా "భీష్మ" అనే సినిమాతో మరో హిట్ ని అందుకున్నారు. చాలావరకు యూత్ ఫుల్ ఎంటర్టైనర్లు మాత్రమే తీసే వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవి తో చేతులు కలపడం అందరినీ షాక్ కి గురి చేసింది.

వెంకీ కుడుముల ఇప్పటిదాకా తీసిన రెండు సినిమాలు మీడియం రేంజ్ సినిమాలు. కానీ మూడో సినిమాకే మెగా హీరోతో సినిమా చేసే అవకాశాన్ని కొట్టేసాడు వెంకీ. ఇది ఒక రకంగా అదృష్టమే కావచ్చు కానీ వెంకీ కుడుముల పై ఇప్పుడు బాధ్యత బాగా ఎక్కువైంది. చిరంజీవి కి హిట్ ఇవ్వకపోతే మెగా అభిమానులు ను హర్ట్ చేసినట్లే.

కానీ మెగాస్టార్ ని చాలా బాగా ప్రెజెంట్ చేసి మంచి హిట్ కొడితే మాత్రం వెంకీ కుడుముల పేరు టాలీవుడ్ మొత్తం మార్మోగిపోతోంది. మరి ఇంత పెద్ద బాధ్యతను ఈ యువ డైరెక్టర్ ఎంతవరకు మోయగలడో వేచి చూడాల్సిందే.

admin1

admin1

Next Story