సినీ ఎడిటర్ గౌతంరాజు కన్నుమూత

Gautham Raju: కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గౌతంరాజు

Sriveni Erugu
Updated on: 6 July 2022 3:49 PM IST
Film editor Gautham Raju passed away
X

సినీ ఎడిటర్ గౌతంరాజు కన్నుమూత

Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. గౌతమ్ రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు. గౌతమ్ రాజు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాలకు గౌతమ్ రాజు ఎడిటర్‌గా పని చేశారు. సుమారు 800 చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసి.. సినీ పరిశ్రమలో చెరగని ముద్రవేశారు. ముఖ్యంగా తెలుగులో తెరకెక్కిన ఎన్నో హిట్ చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రముఖ నటులు చిరంజీవి, పవన్‌ కల్యాణ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్ నటించిన ఎన్నో సినిమాలకు ఆయన పని చేశారు. ఆది, ఖైదీ నెంబర్ 150, గబ్బర్ సింగ్, కిక్, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్, ఊసరవెల్లి, బద్రినాథ్, కాటమరాయుడు తదితర ప్రాజెక్ట్‌లతో ఆయన సినీ ప్రేక్షకుడి మది గెలుచుకున్నారు. చట్టానికి కళ్లులేవు సినిమాతో గౌతమ్ రాజు ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆది చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా నంది అవార్డును అందుకున్నారు.


Sriveni Erugu

Sriveni Erugu

Next Story