శరత్ మండవకి షాక్ ఇచ్చిన రవితేజ

Film Director Sarath is Still Waiting For Ravi Teja
x

శరత్ మండవ కి షాక్ ఇచ్చిన రవితేజ

Highlights

Ravi Teja: రవితేజ రాకకై ఎదురు చూస్తున్న రామారావు డైరెక్టర్

Ravi Teja: వరుస ఫ్లాపుల‌తో సతమతమైన మాస్ మహారాజా రవితేజ "క్రాక్" సినిమా తో మర్చిపోలేని సూపర్ హిట్ ను అందుకున్నారు. రవితేజ నటించిన కిలాడి సినిమా అంతంత మాత్రంగా అనిపించినప్పటికీ తన తదుపరి సినిమా "రామారావు ఆన్ డ్యూటీ" పై మంచి అంచనాలు నెలకొన్నాయి. శరత్ మండవ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు.

ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జులై 17న విడుదల చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అనుకున్న విధంగా రాకపోయేసరికి రవితేజ మళ్లీ ఏడు రోజులు సినిమాని రిలీజ్ చేయాలని చెప్పారని సమాచారం. దీంతో సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేశారు చిత్ర బృందం కానీ ఆ సీన్లను ఇంకా ఎడిట్ చేయాల్సింది. ఆ సన్నివేశాలన్నీ చూడకుండానే రవితేజ తన నెక్స్ట్ సినిమా "టైగర్ నాగేశ్వరరావు" షూటింగ్కి వెళ్లి పోయారని తెలుస్తోంది. రవితేజ కోసం సినిమా డైరెక్టర్ శరత్ ఇంకా ఎదురుచూస్తున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories