Krishnam Raju: కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు, నేతల సంతాపం

Krishnam Raju: దిగ్గజ స్టార్ మరణంతో శోకసంద్రంలో సినీ పరిశ్రమ

Jyothi
Updated on: 11 Sept 2022 1:35 PM IST
Film Celebrities and Leaders Condolence To Krishnam Raju Death
X

Krishnam Raju: కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు, నేతల సంతాపం 

Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు అస్తమయంతో సినీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. తన నటతో తెలుగు ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటుడు ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణంరాజు మృతిపట్ల సినీ ప్రముఖులతో పాటు పలువురు నేతలు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కృష్ణంరాజు మృతి పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు, ప్రభాస్‌కు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు మరణంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సంతపాం ప్రకటించారు. రెబల్ స్టార్‌గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణం రాజు మరణం... టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

కృష్ణంరాజు హఠాన్మరణంపై టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు. హృదయం బద్దలైందని మంచు విష్ణు ట్వీట్ చేశారు. మనసు ముక్కలయ్యే వార్త ఇది అని శర్వానంద్ పేర్కొన్నారు. మీరెప్పటికి మా హృదయాల్లో ఉంటారని డైరెక్టర్ మారుతి తెలిపారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Next Story