Mahesh Babu: మహేశ్ బాబు కోసం లేడీ డైరెక్టర్?

Female director on waiting mode for Mahesh Babu?
x

లేడీ డైరెక్టర్ సుధా కొంగర, మహేష్ బాబు (ఫొటో దిహాన్స్ ఇండియా)

Highlights

Mahesh Babu: లేడీ డైరెక్టర్ సుధా కొంగర తెలుగులో తన చివరి రెండు చిత్రాలతో పెద్ద హిట్స్ సాధించారు.

Mahesh Babu: లేడీ డైరెక్టర్ సుధా కొంగర తెలుగులో తన చివరి రెండు చిత్రాలతో పెద్ద హిట్స్ సాధించారు. 'గురు', 'ఆకాశం నీ హద్దురా' సినిమాలతో టాలీవుడ్ లో విజయవంతం అయ్యారు. తాజాగా ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈమె త్వరలో మహేష్ బాబుతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సూరియా దర్శకుడిని మహేష్ బాబుకు సిఫారసు చేసినట్లు చెబుతారు. '

డైరెక్టర్ సుధా ఇప్పటికే స్క్రిప్ట్‌ను మహేష్‌కు వివరించినట్లు చెబుతున్నారు. అయితే, మహేష్ బాబు మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉంచాడని టాక్ వినిపిస్తోంది. మహేష్ ఇప్పటికే రెండు చిత్రాలను లైన్‌లో పెట్టారు. ఈ లేడీ డైరెక్టర్ తో కలిసి పనిచేసేందుకు ఇంకా పిలుపునివ్వలేదు.

పాన్-ఇండియా గా మూవీ గా వస్తుందని, కథను డైరెక్టర్ సుధా అలానే సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి, మహేష్ పరశురాం, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళిలతో కలిసి పనిచేస్తున్నారు. కొత్త సినిమాపై మరిన్ని వివరాలు త్వరలో బయటకు వస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories