Liger: "లైగర్" సినిమాపై మొదలవుతున్న కొత్త భయాలు

Liger: లైగర్ సినిమా మీద రోజు రోజుకీ పెరుగుతున్న అనుమానాలు

admin1
Published on: 3 Nov 2021 3:30 PM IST
Fear to Vijay Devarakonda Fans on Liger Movie
X
లైగర్ సినిమాపై రోజురోజుకు పెరుగుతున్న అనుమానాలు (ఫైల్ ఇమేజ్)

Liger: గత దశాబ్దకాలంగా చూస్తే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డు చాలా దారుణంగా ఉంది. ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ లని అందించిన పూరీ జగన్నాథ్ ఇప్పుడు కనీసం ఒక మోస్తారు హిట్లు కూడా ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎంతసేపు మాఫియా చుట్టూ సినిమాలు తీస్తున్న పూరి జగన్నాథ్ "రోగ్" వంటి డిజాస్టర్ సినిమా తీస్తారని ఎవరు కలలో కూడా అనుకుని ఉండరు. చాలా కాలం తర్వాత ఈ మధ్యనే "ఇస్మార్ట్ శంకర్" అనే సినిమాతో పెద్ద హిట్ అందుకున్నారు. అయితే ఆ సినిమా కూడా పూరి జగన్నాథ్ హిట్ కి ఫ్లూక్ హిట్ అనే చెప్పాలి. అయినా సరే "ఇస్మార్ట్ శంకర్" సినిమా చూశాక విజయ్ దేవరకొండ కూడా "లైగర్" సినిమా ఒప్పుకున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ నమ్మకాన్ని నిలబెట్టాలి పూరి.

మరోవైపు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అందుకే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు పూరి. కరోనా కారణంగా మాత్రమే కాక సినిమా బాగా రావాలని ఉద్దేశంతోనే ఈ సినిమా కోసం చాలా టైమ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పూరి తనయుడు ఆకాష్ పూరి నీ పరిచయం చేస్తూ "మహబూబా" వంటి డిజాస్టర్ సినిమాలు తీయడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఆకాష్ పూరి నటించిన రెండవ సినిమా "రొమాంటిక్" కి కూడా కథ అందించింది పూరినే. ఇక ఆ కథ కూడా పెద్ద గొప్పగా ఏమీ లేదు. అదే అవుట్ డేటెడ్ కథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పూరి. ఈనేపథ్యంలో "లైగర్" తో మాత్రం ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించగలరు అని అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. అలానే "లైగర్" సినిమా మీద భయాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి.

admin1

admin1

Next Story