Faria Abdullah: నాగార్జున తో స్టెప్పులేయబోతున్న జాతిరత్నాలు బ్యూటీ

Faria Abdullah: నాగార్జున సినిమా అవకాశం అందుకున్న ఫరియా

admin1
Published on: 22 Nov 2021 4:39 PM IST
Faria Abdullah Got a Chance to Dance with Nagarjuna in Bangarraju Movie
X

నాగార్జునతో కలసి స్టెప్పులేయనున్న ఫారియా అబ్దుల్లా (ఫైల్ ఇమేజ్)

Faria Abdullah: "జాతి రత్నాలు" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ఫరియ అబ్దుల్లా. మొదటి సినిమాతోనే తన అందం నటన మాత్రమే కాక కామెడీతో కూడా ప్రేక్షకులని అలరించింది ఈ భామ. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా మారడంతో ఈమె కెరీర్ కి తిరుగులేదు అని అందరూ అనుకున్నారు. తాజాగా ఫరియా అబ్దుల్లా కి ఒక బడా ప్రాజెక్టులో కనిపించే అవకాశం దొరికింది. నాగార్జున హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "బంగార్రాజు" సినిమా లో ఒక స్పెషల్ పాటలో నాగార్జునతో కలిసి స్టెప్పులేయబోతోంది ఫరియా.

నటిగా మారక ముందు నుంచే ఫరియా మంచి డాన్సర్ అట. హిప్ హాప్, బెల్లీ డాన్స్ వంటి వాటిలో ఆమెకి ప్రావీణ్యం ఉందట. కాబట్టి స్పెషల్ సాంగ్ కూడా ఈమె సునాయాసంగా చేసి అందరి మన్ననలు పొందుతుంది అని అందరూ ఆశిస్తున్నారు. "బంగార్రాజు" సినిమా లో మాత్రమే కాక ఫరియా మంచు విష్ణు హీరోగా నటిస్తున్న "ఢీ సీక్వెల్" లో కూడా హీరోయిన్గా నటిస్తోంది. జాతి రత్నాలు సినిమాలో లాగా ఈ సినిమాలో కూడా ఆమెకి హ్యూమరస్ మరియు ఎమోషనల్ గా ఉండే పాత్ర దొరికిందట. మరి ఈ సినిమాతో ఫరియా ఎంతవరకు మెప్పిస్తుందో వేచిచూడాలి.

admin1

admin1

Next Story