పవన్ కళ్యాణ్ స్పీచ్ గురించి కంగారు పడుతున్న అభిమానులు

Pawan Kalyan: గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈమధ్యనే మళ్లీ ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

Arun Chilukuri
Published on: 18 Feb 2022 4:41 PM IST
Fans Worried About Pawan Kalyan Speech
X

పవన్ కళ్యాణ్ స్పీచ్ గురించి కంగారు పడుతున్న అభిమానులు

Pawan Kalyan: గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈమధ్యనే మళ్లీ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. హిందీలో సూపర్ హిట్టయిన పింక్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "భీమ్లా నాయక్". పవన్ కళ్యాణ్ మరియు రానా హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లలో విడుదల కాబోతుంది. మరోవైపు ఈ సినిమా ఈనెల 21వ తేదీన ఈ చిత్ర ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

కానీ గతంలో ఒక సినిమా ఈవెంట్‌కి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గురించి మరియు వైసీపీపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్ల గురించి మరియు స్పెషల్ షో పర్మిషన్ల గురించి పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడుతారు అని అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్లు రేట్ లను పెంచేందుకు పర్మిషన్ ఇస్తూ వస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలా మాట్లాడుతారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే సినిమా ఈవెంట్ కాబట్టి పవన్ కళ్యాణ్ రాజకీయాల టాపిక్ తీసుకురాకపోతే సబబుగా ఉంటుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story