RRR: "ఆర్ఆర్ఆర్" ను ఆ దేశంలో కూడా విడుదల చేయమంటున్న అభిమానులు

RRR: "అర్ ఆర్ ఆర్" చిత్ర బృందం అభిమానుల మాటలు వింటుందా?

Jyothi
Published on: 17 March 2023 12:13 PM IST
Fans Want to Release RRR in that Country too
X

RRR: "ఆర్ ఆర్ ఆర్" ను ఆ దేశంలో కూడా విడుదల చేయమంటున్న అభిమానులు

RRR: "ఆర్ఆర్ఆర్" సినిమా లోని నాటు నాటు పాట ఈ మధ్యనే ఆస్కార్ కూడా అందుకొని మరొకసారి ప్రపంచం మొత్తం టాలీవుడ్ గురించి మాట్లాడుకునేలా చేసింది. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా గతేడాది థియేటర్లలో విడుదల అయి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు నమోదు చేసుకొని రికార్డుల మీద రికార్డులు సృష్టించింది.

భారతదేశంలో మాత్రమే కాక మిగతా దేశాల్లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన ఆదరణ లభించింది. ఇక జపాన్లో కూడా రికార్డుల మోత మోగించింది ఈ సినిమా. తాజాగా ఇప్పుడు ఈ సినిమాని చైనాలో కూడా విడుదల చేస్తే బాగుంటుంది అని అభిమానులు చెబుతున్నారు. ఈ మధ్యనే సినిమాని జపాన్లో విడుదల చేస్తున్న సమయంలో చైనాలో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు చిత్ర బృందం చెప్పుకొచ్చింది.

తాజాగా "నాటు నాటు" ఆస్కార్ గెలవడంతో ఇప్పుడు "ఆర్ఆర్ఆర్" పై ఉన్న క్రేజ్ కూడా బీభత్సంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సమయంలో "ఆర్ఆర్ఆర్" సినిమాని చైనాలో కూడా విడుదల చేస్తే అది ఖచ్చితంగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిమానులు చెబుతున్నారు. మరి అభిమానుల మాట విని చిత్ర బృందం సినిమాని చైనాలో విడుదల చేస్తుందో లేదో వేచి చూడాలి.

Jyothi

Jyothi

Next Story