విజయ్ దేవరకొండపై విమర్శల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు

Vijay Devarakonda: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మరియు డైనమిక్ డైరెక్టర్ పురీ జగన్నాథ్ కాంబో లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మొదటి సినిమా "లైగర్".

Arun Chilukuri
Published on: 2 July 2022 5:29 PM IST
Fans Trolling Vijay Devarakonda For His Movie Poster
X

విజయ్ దేవరకొండపై విమర్శల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు

Vijay Devarakonda: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మరియు డైనమిక్ డైరెక్టర్ పురీ జగన్నాథ్ కాంబో లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మొదటి సినిమా "లైగర్". ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కానీ గత కొద్దిరోజులుగా ఈ సినిమాపై నెగటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఒక పోస్టర్ వల్ల నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తెగ ట్రోల్ చేస్తున్నారు.

దానికి కారణం ఆ పోస్టర్లో విజయ్ దేవరకొండ దాదాపు నగ్నంగా తన ప్రైవేట్ పార్ట్ మీద రోజా పూల గుత్తిని అడ్డంగా పెట్టుకొని పోజ్ ఇవ్వడం. అయితే గతంలో కూడా సంపూర్ణేష్ బాబు "క్యాలీఫ్లవర్" సినిమా పోస్టర్ కోసం అలానే పోజ్ ఇచ్చారు. ఇక బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ కూడా "పీకే" సినిమా కోసం రేడియో ని అడ్డుపెట్టుకొని పోజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో క్రియేటివిటీ లేకుండా ఎప్పుడో వాడేసిన స్ట్రాటజీలను ఈ సినిమా కోసం వాడుతున్నారు అంటూ అభిమానులు చిత్రబృందంపై మండిపడుతున్నారు. కంటెంట్ మాట్లాడాలి కానీ ఇలాంటి పోస్టర్లు కాదు అంటూ కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు. ఏదేమైనా ఈ ఒక్క పోస్టర్ తో సినిమాపై ట్రోలింగ్ బాగా పెరిగిపోయింది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఆగస్ట్ 25 న సినిమా విడుదల కాబోతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story