Mrunal Thakur: బికినీ ఫోటోలతో ఊహించని తలనొప్పి.. హిట్ మూవీనే తన ఫ్యూచర్ కి గేట్ క్లోజ్ చేసేలా..

Mrunal Thakur Shares Bikini Photos: మృణాల్ ఠాగూర్ కి పెద్ద చిక్కొచ్చిపడింది.

Arun Chilukuri
Updated on: 5 April 2023 9:30 PM IST
Fans Trolls Mrunal Thakur on Bikini Photos
X

Mrunal Thakur: బికినీ ఫోటోలతో ఊహించని తలనొప్పి.. హిట్ మూవీనే తన ఫ్యూచర్ కి గేట్ క్లోజ్ చేసేలా..

Mrunal Thakur Shares Bikini Photos: మృణాల్ ఠాగూర్ కి పెద్ద చిక్కొచ్చిపడింది. తన లేటెస్ట్ స్విమ్ సూట్ ఫోటోలతో ఊహించని తలనొప్పి వచ్చింది. కెరీర్ పరంగా ముందుకెళితే గొయ్యి, వెనక్కి వస్తే నుయ్యి అనేలా తన పరిస్థితి మారింది. మొత్తానికి తన హిట్ మూవీనే తన ఫ్యూచర్ కి గేట్ క్లోజ్ చేసేలా ఉంది. మృణాల్ ఠాగూర్ హిందీ హీరోయినే అయినా, తెలుగమ్మాయిగా ఫోకస్ అయ్యింది. అంతగా తనని ఓన్ చేసుకునేలా సీతారామంలో తన పాత్ర ఓరేంజ్‌లో జనాల్లోకి వెళ్లింది. కట్ చేస్తే సీత పాత్రలో తనని చూసిన జనం, ఇప్పుడు స్విమ్ సూట్లు, హాట్ బికినీల్లో చూసి జీర్నించుకోలేకపోతున్నారట. సీతారామంలో సీతేనా ఇలా ఉంది? అంటూ సోషల్ మీడియాలో మృణాల్ మీద కౌంటర్లు పేలిపోతున్నాయి. ఎలాంటి సీత ఎలా మారిందంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

కొన్ని సార్లు హిట్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందంటారు. ఇప్పుడు మృణాల్ విషయంలో అదే జరిగుతోందట. తనని సీత పాత్రలో ఇష్టపడ్డ జనం, కాస్త గ్లామర్ గా కనిపించినా సహించేపరిస్తితి లేదు. అదే తనని ఇబ్బంది పెట్టేలా ఉందట. సీత పాత్రలో పేరుతో పాటు హిట్ సొంతం చేసుకంది మృణాల్ ఠాగూర్. కాని తను ఎప్పుడూ అలాంటి రోల్సే వేస్తే, అలాంటి పాత్రలు రావాలని లేదు. గ్లామరస్ గా కనిపించకపోతే ఆఫర్స్ రావనే అభిప్రాయముంది.. కాని సీత బ్రాండ్ ఇమేజ్ వల్ల తను కవ్వించే లుక్ లో కనిపిస్తే, షాకిచ్చే రెస్పాన్స్ జనం నుంచి వస్తోంది.

సీతారామం హిట్ తో మృణాల్ కి ఓవర్ నైట్ లో సౌత్ మార్కెట్ క్రియేట్ అయ్యింది. అలాంటి తను ఇక్కడ ఆఫర్స్ పట్టాలన్నా, ఇక్కడి జనాలను ఆకట్టుకోవాలన్నా, తన ఇమేజ్ ని కాపాడుకోవాలి. అలా కాక మిగతా బాలీవుడ్ హీరోయిన్ల మాదిరే గ్లామర్ రూట్లో వెలితే సౌత్ లో పంచ్ పడే ఛాన్స్ ఉంది. అలాని గ్లామర్ రూట్ కి వదులుకుంటే, బాలీవుడ్ ఆఫర్స్ ఆవిరయ్యే ఛాన్స్ ఉంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story