అందుకే బన్నీ అభిమానులు దేవి ని చూసి భయపడుతున్నారా?

Fans Think Allu Arjun Pushpa 2 Is In Danger Due To Devi Sri Prasad
x

అందుకే బన్నీ అభిమానులు దేవి ని చూసి భయపడుతున్నారా?

Highlights

Devi Sri Prasad: రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటికే బోలెడు సినిమాలు వచ్చాయి.

Devi Sri Prasad: రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటికే బోలెడు సినిమాలు వచ్చాయి. అందులో చాలా వరకు మ్యూజికల్ హిట్స్ గా కూడా నిలిచాయి. ఆర్య, బన్నీ, ఆర్య 2, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాథం సినిమాలకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇందులో చాలా వరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ లు అవ్వడమే కాక మ్యూజికల్ హిట్స్ గా కూడా నిలిచాయి.

తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన "పుష్ప: ది రైజ్" కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. కానీ తాజా సమాచారం ప్రకారం బన్నీ అభిమానులు దేవి శ్రీ ప్రసాద్ ను చూసి భయపడుతున్నారట. దీనికి కారణం లేకపోలేదు. అయితే దేవి సంగీతం అందించిన "ది వారియర్" సినిమాలోని బుల్లెట్ పాట తెలుగుతో పాటు తమిళంలో కూడా వైరల్ గా మారింది. కానీ సినిమాలో దేవి అందించిన నేపథ్య సంగీతం మాత్రం కేవలం యావరేజ్ గా నిలిచింది.

మరోవైపు ఈ మధ్య దేవి సంగీతం బాగోలేదు అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో దేవిశ్రీప్రసాద్ ఎంత మంచి మ్యూజిక్ అందించినప్పటికీ అది ఎక్కడో విన్నట్టుగా ఉంటుందని దేవీ కూడా ట్రెండ్ తో పాటు అప్డేట్ అవ్వాలని ఎన్నో కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో "పుష్ప: ది రూల్" సినిమాకి దేవిశ్రీప్రసాద్ అందించబోయే సంగీతం ఎలా ఉండబోతుందో అని అభిమానులు గాబరా పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories