Prabhas Fans: ఆ విషయంలో కంగారు పడుతున్న ప్రభాస్ అభిమానులు

Prabhas Fans: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "రాధేశ్యామ్".

admin1
Updated on: 26 Dec 2021 10:15 AM IST
Fans Tension about Prabhas Radhe Shyam Movie Visual Effects of Ship Scene | Tollywood News
X

Prabhas Fans: ఆ విషయంలో కంగారు పడుతున్న ప్రభాస్ అభిమానులు

Prabhas Fans: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "రాధేశ్యామ్". భారీ అంచనాల మధ్య ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అయితే ట్రైలర్ అనుకున్న రేంజ్ లో లేకపోవడంతో అభిమానులు బాగా నిరాశ చెందారు అని చెప్పుకోవచ్చు. బాక్గ్రౌండ్ విజువల్స్ మరియు కెమెరా వర్క్ కూడా అద్భుతంగా కాకపోయినా ఒక మోస్తరుగా బాగానే ఉన్నాయి.

కానీ వీ ఎఫ్ ఎక్స్ బాగా లేకపోవడంతో అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు. ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ లో కానీ షిప్ సీన్ ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కానీ ఆ సన్నివేశానికి హాలీవుడ్ రేంజ్ క్వాలిటీ ఔట్ పుట్ లేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కీలకమైన సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ బాగా లేకపోతే సినిమా ఎమోషనల్ గ్రాఫ్ బాగా దెబ్బతింటుంది.

అది సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో తేడా జరిగితే సినిమా మా రిజల్ట్ పై భారీగా అది భారీగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని అభిమానులు కంగారు పడుతున్నారు. ఇందులో నిజానిజాలు తెలియాలంటే సినిమా విడుదలవ్వాల్సిందే.

admin1

admin1

Next Story