మేజర్ విషయంలో మహేష్ బాబు అలా చేసి ఉండాల్సిందా?

మేజర్ విషయంలో మహేష్ బాబు అలా చేసి ఉండాల్సిందా?

Rama Rao
Updated on: 13 Jun 2022 9:01 PM IST
Fans Talking about Mahesh Babu in the Case of Major Movie
X

మేజర్ విషయంలో మహేష్ బాబు అలా చేసి ఉండాల్సిందా? 

Major Movie: అడవి శేష్ హీరోగా "గూఢచారి" ఫేమ్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో విడుదలైన సినిమా "మేజర్". 26/11 ముంబై ఎటాక్ లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 3న థియేటర్లలో విడుదల అయింది. శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు ముఖ్య పాత్రలుపోషించారు.

ఈ సినిమా ని సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ వారు నిర్మించగా, శ్రీ చరణ్ పాకల ఈ సినిమా కి సంగీతాన్ని అందించారు. ఇక సినిమా మొదటి రోజు నుండి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లతో ముందుకు దూసుకు వెళుతోంది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక హిందీ లో కూడా మంచి విజయాన్ని సాధించింది. సినిమా విడుదలకు ముందే ప్రీమియర్ ల కారణంగా సినిమా కి విడుదలకు ముందు నుంచి మంచి రెస్పాన్స్ రావడం మొదలైంది.

కానీ తెలుగుతో పోల్చుకుంటే మాత్రం హిందీలో ఈ సినిమా కలెక్షన్లు అంత ఎక్కువగా కనిపించడం లేదు. నార్త్ లో ఈ సినిమా 10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఇది చిన్న విషయం కాకపోయినప్పటికీ హిందీలో సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయక పోవటం దీనికి కారణమని కొందరు వేలెత్తి చూపిస్తున్నారు. హిందీలో కూడా సినిమా ప్రమోషన్లపై చిత్ర నిర్మాత మహేష్ బాబు దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story