Allu Arjun: వైజాగ్‌లో పుష్పరాజ్ భారీ కటౌట్.. ఫోటోలు, వీడియోలు వైరల్

Allu Arjun: గతకొద్ది రోజులుగా పుష్ప 2 మేనియా కొనసాగుతోంది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Nov 2024 4:07 PM IST
Fans Put Allu Arjun’s 108 Feet Cutout in Visakhapatnam
X

Allu Arjun: వైజాగ్‌లో పుష్పరాజ్ భారీ కటౌట్.. ఫోటోలు, వీడియోలు వైరల్

Allu Arjun: గతకొద్ది రోజులుగా పుష్ప 2 మేనియా కొనసాగుతోంది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న గ్రాండ్‌గా ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కానుంది. థియేటర్ల వద్ద పుష్ప 2 మూవీకి గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చేందుకు అభిమానులు వారి ఏర్పాట్లలో వారు ఉన్నారు. ఈ క్రమంలోనే వైజాగ్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంగం శరత్ థియేటర్ వద్ద ఏకంగా 108 అడుగుల ఎత్తైన భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఇటీవలే ఈ కటౌట్ ఆవిష్కరించారు. ఆకాశమే హద్దుగా కనిపిస్తోన్న ఈ పుష్పరాజ్ కటౌట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్ప 2. మూడేళ్ల క్రితం రిలీజై బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన పుష్ప సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. పుష్ప 2 సినిమాను ప్రమోట్ చేసే పనుల్లో చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా యాక్టివ్‌గా ఉన్నారని ఈ ఘటన నిరూపిస్తోంది. ఇందులో భాగంగానే భారీ కటౌట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ హీరోకు ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేయలేదంటున్నారు బన్నీ ఫ్యాన్స్. 108 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పుతో ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని గర్వంగా చెబుతున్నారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story