Liger: 'లైగర్' టీంపై ఒత్తిడి పెంచుతోన్న ఫ్యాన్స్? కారణం ఇదే..!

Fans Pressuring Liger Movie Team For New Updates | Vijay Devarakonda | Puri Jagannath
x

లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ (ఫొటో ట్విట్టర్)

Highlights

Liger: విజయ్ దేవరకొండ, డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోంది 'లైగర్' సినిమా.

Liger: విజయ్ దేవరకొండ, డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోంది 'లైగర్' సినిమా. ఈ కాంబో లో మూవీ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తన కెరీర్‌లో తొలిసారిగా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో నటించబోతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతోనే ఈమె టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా, 'లైగర్' షూటింగ్ నిలిచిపోయింది.

కానీ, తాజా నివేదికల ప్రకారం, మూవీ యూనిట్ పై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోందంట. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ చిత్రంపై అప్‌డేట్స్‌ను విడుదల చేయాలని సోషల్ మీడియాలో మేకర్స్ ను కోరుతున్నారు. 'లైగర్' బృందం నుంచి న్యూస్ రాక చాలాకాలమైంది. దీంతో అభిమానులు ఈ సినిమా లెటేస్ట్ న్యూస్ తెలుసుకోవాలని పట్టుబడుతున్నారు. దీంతో సినిమా యూనిట్ పై ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది.

మరోవైపు, మూవీ యూనిట్ కూడా తమ ప్రమోషన్లు ప్రారంభించడానికి సరైన సమయం కోసం వేచి ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా విడుదలపై కూడా ఎటువంటి న్యూస్ రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories