చిరంజీవి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ పూజలు

తెలుగు సినీ పరిశ్రమను కరోనా మహమ్మారి నీడలా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకోగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వైరస్ సోకిన వారి లిస్ట్ లో చేరారు
తెలుగు సినీ పరిశ్రమను కరోనా మహమ్మారి నీడలా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకోగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వైరస్ సోకిన వారి లిస్ట్ లో చేరారు. ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు చిరంజీవి. అయితే, కరోనా పాజిటివ్ రావడంతో ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
''ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను.'' అంటూ ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
కరోనా సోకడంతో ఆచార్య షూటింగ్ ప్రారంభానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అటు చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంతో టాలీవుడ్ ప్రముఖులతో పాటుగా అభిమానులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. ఇక ఆయన త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు పూజలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. చిరు త్వరగా కోలుకొని మళ్లీ సినీ అభిమానులను అలరించాలని వేడుకుంటున్నారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
Health Tips: తొందరగా అలసిపోతున్నారా.. ఈ జ్యూస్లని డైట్లో...
12 Aug 2022 10:30 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్...
12 Aug 2022 9:55 AM GMTCM Jagan: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్.. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక...
12 Aug 2022 9:43 AM GMTMacherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ..
12 Aug 2022 9:29 AM GMTమునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ ఫోకస్..
12 Aug 2022 8:38 AM GMT