"నాటు నాటు" పాటలో తప్పులు వెతుకుతున్న అభిమానులు

నాటు నాటు విషయంలో రాజమౌళి చేసిన తప్పులు ఉన్నాయని అంటున్న నెటిజన్లు

admin1
Updated on: 12 April 2022 8:00 PM IST
Fans Looking for Mistakes in the  Naatu Naatu Song | Tollywood News
X

"నాటు నాటు" పాటలో తప్పులు వెతుకుతున్న అభిమానులు

Naatu Naatu Song: రామ్ చరణ్ మరియు యు.ఎన్ టీఆర్ ల డాన్స్ కి మాత్రమే సెపరేట్ ఫ్యాన్ బెస్ ఉంది. అలాంటిది ఇద్దరూ అద్భుతమైన డాన్సర్లు ఒకేసారి వెండితెరపై డాన్స్ చేస్తూ కనిపించారు అంటే ఆ పాట గురించి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అందుకనే "ఆర్ ఆర్ ఆర్" సినిమా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సినిమాలోని "నాటు నాటు" పాటలో వారి గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ప్రమోషన్ ఇంటర్వ్యూ లలో భాగంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ మరియు రాంచరణ్ చాలా సందర్భాల్లో నాటు నాటు పాట షూటింగ్ సమయంలో తమ ఇద్దరి మధ్య సింక్ బాగా బాగా కుదిరే దాకా రాజమౌళి బోల్డు టేకులు తీసుకున్నారని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వారిద్దరి మధ్య సింక్ కొన్ని సందర్భాల్లో అంత బాగా కుదరలేదు అని కొందరు నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో గొడవ చేస్తున్నారు.

ఇద్దరు స్టార్ హీరోల డాన్స్ లో చాలా సందర్భాల్లో బేధాలు ఉన్నాయని వాటిని సరిగ్గా రాజమౌళి గమనించి ఉంటే బాగుండేదని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా "నాటు నాటు" పాట మాత్రం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. యూట్యూబ్ లో ఈ పాట 1.2 మిలియన్ వ్యూస్ చేరుకోగా, ఈ పాట హిందీ వెర్షన్ 2.5 మిలియన్ వ్యూస్ తో రికార్డులు సృష్టించింది.

admin1

admin1

Next Story