Mahesh Babu: మహేష్ బాబుకు సొంత ఫ్యాన్స్ గుస్సా.. ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోమంటూ స్ట్రాంగ్ వార్నింగ్

Fans Fire On Super Star Mahesh Babu
x

Mahesh Babu: మహేష్ బాబుకు సొంత ఫ్యాన్స్ గుస్సా.. ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోమంటూ స్ట్రాంగ్ వార్నింగ్

Highlights

Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు పై ఫ్యాన్స్ గరం అయ్యారు. ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.

Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు పై ఫ్యాన్స్ గరం అయ్యారు. ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి అంతగా ఫ్యాన్స్ ఇరిటేట్ అయ్యేలా మహేష్ ఏం చేశాడు..అనేగా మీ సందేహం..మహేష్ బాబు చేసిన ఒక ట్వీటే ఇందుకు కారణం..విషయం ఏంటంటే సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా మేమ్ ఫేమస్. విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంగా నడిచే ఈ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాని కొందరు మహేష్ బాబు ఫ్యాన్స్ చూశారు..చూసిందే ఆలస్యం..తమ అభిమాన హీరోని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తగులుకున్నారు.

మేమ్ ఫేమస్ చిత్రానికి మహేష్ బాబు రివ్యూ ఇవ్వడమే ఇందుకు కారణం. ఈ సినిమా చూశానని..చాలా బాగుందని..నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారని మహేష్ బాబు తన ట్వీట్ లో మేమ్ ఫేమస్ టీమ్ ని ఆకాశానికి ఎత్తేశారు. తమ అభిమాన హీరో పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో సినిమాపై భారీ అంచనాలతో ఘట్టమనేని ఫ్యాన్స్ సినిమాకి వెళ్లారు. తీర సిల్వర్ స్క్రీన్ పై బొమ్మను చూసి అవాక్కయ్యారు. మహేష్ బాబు చేసిన ట్వీట్ కి సినిమా సాగిన తీరు పూర్తిగా విరుద్ధంగా ఉంది. అందుకే, సూపర్ స్టార్ పై ఫ్యాన్స్ అగ్గిమీదగుగ్గిలం అయ్యారు. ఫ్లాప్ సినిమాని ఎలా బాగుందంటావని సోషల్ మీడియాలో మహేష్ ను ఫ్యాన్స్ నిలదీశారు. ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు కూడా..

మేమ్ ఫేమస్ చిత్రాన్ని చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మించింది. ఈ సంస్థతో కలిసి మహేష్ బాబు తన జీఎమ్ బీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి మేజర్ సినిమాని నిర్మించారు. ఆ తర్వాత ఇదే బ్యానర్ లో వచ్చిన రైటర్ పద్మభూషణ్ చిత్రంపై కూడా మహేష్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు. ఈ సినిమా హిట్టయింది. దీంతో గతంలో ఉన్న పరిచయంతో మేమ్ ఫేమస్ చిత్రానికి సైతం మహేష్ బాబు పాజిటివ్ ట్వీట్ ఇచ్చాడు. అయితే అది బెడిసి కొట్టింది. మొత్తానికి, మహేష్ బాబు మొహమాటానికి పోయి చేసిన ట్వీట్..అసలుకే మోసం తెచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories