RRR: "ఆర్ ఆర్ ఆర్" కి సీక్వెల్ కావాలి అంటున్న అభిమానులు...

RRR: తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది...

admin1
Updated on: 28 March 2022 2:02 PM IST
Fans Demanding SS Rajamouli to do RRR Sequel | Jr NTR | Ram Charan
X

RRR: "ఆర్ ఆర్ ఆర్" కి సీక్వెల్ కావాలి అంటున్న అభిమానులు...

RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఇండియన్ సినిమా "ఆర్ ఆర్ ఆర్". చాలా సార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 25న థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది.

క్రిటిక్స్ నుంచి సెలబ్రిటీల దాకా అందరూ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. బాహుబలి ఫ్రాంచైస్ తర్వాత రాజమౌళి ఖాతాలో మరో ఒక బ్లాక్ బస్టర్ సినిమా చేరింది. అయితే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకి చాలా బాగా వర్కవుట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి మరో సీక్వెల్ ఉంటే బాగుంటుందని అభిమానులు రాజమౌళిని అడుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇంతకు ముందు బాహుబలి లాగా "ఆర్ ఆర్ ఆర్" ని కూడా రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయా అని అడగగా రాజమౌళి ఇది కేవలం ఒక పార్ట్ సినిమా నేనని దీనికి సీక్వెల్ ఉండదని ముందుగానే క్లారిటీ ఇచ్చారు. కానీ అభిమానులు మాత్రం ఈ సినిమాకి సీక్వెల్ తీయమని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో రాజమౌళి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

admin1

admin1

Next Story